loader

ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌వే అవసరం లేదు.. భారత శాస్త్రవేత్తల ఘనత.

ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఒక బృందం విమానం నేరుగా, సజావుగా ల్యాండ్ అయ్యేలా చేసే సాంకేతికతను కనిపెట్టింది. విమానం నేరుగా ల్యాండ్ అయ్యేలా హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్, వర్చువల్ సిమ్యులేషన్ టెక్నాలజీని అనుసంధానించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు దీనిని సాధించడానికి కష్టపడుతున్నారు. భారతీయ శాస్త్రవేత్తలు దీనిని సాధించడం గర్వకారణం. నేరుగా టేకాఫ్, ల్యాండ్ చేయగల సాంకేతికత చాలా సంక్లిష్టమైనది IIT మద్రాస్ బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించడంలో విజయం సాధించింది. ఈ బృందం వారి ప్రయోగాన్ని […]

భార్య క్రైస్త‌వాన్ని స్వీక‌రించాల‌ని ఆశిస్తున్నా: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్య‌క్షుడు JD Vance ఇర‌కాటంలో ప‌డ్డారు. హిందూ మ‌తానికి చెందిన త‌న భార్య ఉషా వాన్స్‌.. క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించాల‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ ప‌ట్ల జేడీ వాన్స్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. యూనివ‌ర్సిటీ ఆఫ్ మెసిసిప్పిలో జ‌రిగిన ట‌ర్నింగ్ పాయింట్ యూఎస్ఏ మీటింగ్‌లో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. త‌న భార్య ఉషా త‌నతో చ‌ర్చికు హాజ‌ర‌వుతోంద‌ని, కానీ ఆమె ఏదో ఒక రోజు పూర్తిగా క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రిస్తుంద‌ని […]

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది. షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్ఠను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు విభాగం ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

ప్రియురాలి సింగింగ్ పర్ఫార్మెన్స్ చూసేందుకు..రూ. 500 కోట్ల ఎఫ్‌బీఐ జెట్ వాడిన కాష్ పటేల్

అమెరికన్ సమాఖ్య పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా పని చేస్తున్న కాష్ పటేల్ తన అధికారిక పదవిని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన స్నేహితురాలు, కంట్రీ సింగర్ అలెక్సిస్ విల్కిన్స్.. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ‘రియల్ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్’ ఈవెంట్‌లో ఆమె ప్రదర్శనను చూసేందుకు ఆమె ప్రియుడు కాష్ పటేల్.. ఎఫ్‌బీఐకు చెందిన జెట్‌పై ప్రయాణించారని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఈ సంచలనాత్మక విషయాన్ని […]

పాక్ వ్యోమగామిని స్పేస్​లోకి తీసుకెళ్లనున్న చైనా

పాకిస్థాన్ విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్ పాకిస్థాన్​తో జట్టుకట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో స్వల్పకాలిక మిషన్లలో భాగంగా పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ వద్దకు త్వరలో తీసుకెళ్లనుంది. అందుకోసం చైనా వ్యోమగాములతో కలిసి పాకిస్థాన్ వ్యోమగామికి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాగన్ ప్రకటన విడుదల చేసింది.

భేటీ అద్భుతం..చైనాపై టారిఫ్‌లను తగ్గిస్తున్నా: ట్రంప్‌

అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. చైనాపై విధించిన టారిఫ్‌లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటూ జరిగిన భేటీలో పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.

ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల 182 రోజుల వయసులో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దాంతో లేటు వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇన్నేళ్ల తన వన్డే క్రికెట్‌ కేరీర్ లో మొదటి స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గాడ్ ఆఫ్ క్రికెట్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించాడు హిట్ మ్యాన్.

అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇకపై ఉద్యోగ అనుమతి పత్రాల (EAD) ఆటోమేటిక్ పొడిగింపు ఉండదు. ఈ కొత్త నియమం వల్ల వేలాది విదేశీ ఉద్యోగులు — ముఖ్యంగా భారతీయులు తమ పర్మిట్ రీన్యువల్ సమయానికి ఆమోదం పొందకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఈ తాత్కాలిక తుది నియమం బుధవారం ప్రకటించబడగా, గురువారం నుంచే అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు, పర్మిట్ రీన్యువల్ కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగులు 540 రోజుల […]

ప్రపంచంలోనే తొలి 5 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా Nvidia..

Nvidia సంస్థ అరుదైన రికార్డును అందుకుంది. చరిత్రలోనే తొలిసారిగా ఐదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ సొంతం చేసుకున్న తొలి కంపెనీగా ఘనత సాధించింది. భారత్  జిడిపి ఐదు ట్రిలియన్ డాలర్లు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే, భారత్, యూకే, జపాన్ దేశాల జిడిపి లను సైతం వెనక్కు నెట్టి ముందుకు దూసుకొని వెళ్ళింది. ఈ ఐదు ట్రిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో మార్చినట్లయితే సుమారు 420 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. CEO జెన్సెన్ హువాంగ్ సగర్వంగా ఈ ఘనతను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON