loader

సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి..

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతికారమా అన్నట్టు సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి. ఈ దాడిలో రెండు ‘వన్-వే అటాక్’ డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం

సోషల్‌మీడియాకు బానిసలుగా మారుస్తున్నయ్‌

పిల్లలను ఆన్‌లైన్‌ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మానవ అక్రమ రవాణా లాంటి ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ విఫలమయ్యాయని జ్యూరీ అభిప్రాయపడింది. ఈ కారణంగా మెటాకు రూ.3,161 కోట్ల భారీ జరిమానా విధించింది.మరో కేసులో కేజీఎం అనే యువతి కుంగుబాటు, ఆందోళనకు మెటా, గూగుల్‌ను కాలిఫోర్నియా జ్యూరీ బాధ్యులుగా […]

వేద మంత్రోచ్ఛారణ, శంఖనాదం నడుమ నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం..!

నేపాల్‌లో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే, ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా ‘బాలెన్’, శుక్రవారం (మార్చి 27) నేపాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన సుమారు ఆరు నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పి) నాయకుడైన బాలేంద్ర, శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో మధ్యాహ్నం 12.34 […]

బ్రిటన్ గడ్డపై తెలంగాణ బిడ్డకు కీలక పదవి

తెలంగాణ గడ్డ నుంచి వెళ్లి విదేశీ రాజకీయాల్లో సత్తా చాటుతున్న హనుమకొండ బిడ్డ హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో, క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఆమె నియమితులవ్వడం తెలుగువారందరికీ గర్వకారణం. స్థానిక నగరాల పాలనలో కీలకమైన డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో హేమ ఎల్లాప్రగడకు దక్కిన ఈ పదవి ఆమె రాజకీయ నైపుణ్యానికి నిదర్శనం. స్థానిక నగరాల్లో పాలన సాగించే డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్స్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ నేతను లీడర్‌ ఆఫ్‌ ది […]

ఇరాన్‌పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన

ఇరాన్‌పై అమెరికా చర్యలకు నాటో మద్దతు ప్రకటించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ, ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నాటో తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే మార్క్ రుట్టే స్పందిస్తూ నాటో వైఖరిని స్పష్టం చేశారు

భారత్ నౌకలకు హర్మూజ్ జలసంధిలో అనుమతి, మరో నాలుగు దేశాలకు కూడా… ప్రకటించిన ఇరాన్

ఇండియా సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బార్ అరాగ్చీ ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలోని యుద్దానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించే లేదని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్‌ నౌకలు సరుకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం […]

తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం ఆగుతుందని ప్రకటన..

ఇరాన్ ప్రధానంగా ఐదు డిమాండ్లు ఇవే :  1.అమెరికా మరియు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, హత్యలు తక్షణమే ఆగిపోవాలి. 2. ఇరాన్‌పై మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సైనిక దాడులు జరగవని పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాలి. 3.యుద్ధం వల్ల ఇరాన్ ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టమైన పరిహారం చెల్లించాలి. 4.హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని అధికారికంగా గుర్తించాలి.5.కేవలం ఇరాన్‌తోనే కాకుండా ఈ ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన సమూహాలపై దాడులు నిలిపివేయాలి.

కొలంబియాలో కూలిన విమానం- 90 మందికి పైగా సైనికులు మృతి!

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 90 మందికి పైగా సైనికులు మృతిచెందినట్లు సమాచారం. దక్షిణ కొలంబియాలోని పుటుమాయో ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కొలంబియన్ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పెరూ సరిహద్దుకు సమీపంలోని ఎయిర్‌స్ట్రిప్ నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం తన నియంత్రణను కోల్పోవడంతో సమీపంలోని దట్టమైన అడవుల్లో పడిపోయి ఒక్కసారిగా పేలిపోయింది.

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్

ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. తమ ఇంధన సంస్థలపై ఎలాంటి దాడులు చేసినా శత్రువుల ఇంధన వనరులపై దాడి చేస్తామని టెహ్రాన్ గట్టి హెచ్చరిక చేసినట్టు తెలిపింది.

లండ‌న్‌లో యూద వ‌ర్గం టార్గెట్‌.. 4 అంబులెన్స్‌ల‌కు నిప్పు

్రిట‌న్‌లోని యూద వ‌ర్గీయుల‌(Jewish Community)పై దాడి జ‌రుగుతోంది. యూద క‌మ్యూనిటీకి చెందిన నాలుగు అంబులెన్స్‌ను లండ‌న్‌లో ధ్వంసం చేశారు. యూదుల‌కు వ్య‌తిరేకంగా హింస‌, విద్వేష దాడి జ‌రుగుతున్న‌ట్లు మెట్రోపాలిట‌న్ పోలీసులు చెప్పారు. గోల్డ‌ర్స్ గ్రీన్‌లో ఉన్న హైఫీల్డ్ రోడ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.ఆ వాహ‌నాల్లో ఉన్న సిలిండ‌ర్లు పేలిన‌ట్లు గుర్తించారు. పేలుడు ధాటికి స‌మీప ఫ్లాట్ల‌కు ఉన్న కిటికీలు కూడా ధ్వంసం అయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON