loader

ఛాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ సరికొత్త ఏఐ మోడల్..

గూగుల్ జెమినీ తాజాగా అప్‌డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ జెమినీ 3 పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. సందర్భం, సూక్ష్మ నైపుణ్యాలు, ఉద్దేశాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి ఈ కొత్త మోడల్ ఉపయోగపడుతుందని గూగుల్ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా సైబర్ దాడుల నుంచి రక్షించేలా జెమినీ 3ని రూపొందించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వస్తున్న ఏఐ మోడ్‌తో కూడా ఈ కొత్త ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు స్పష్టం […]

సిడ్నీలో BMW ఢీకొని భారత సంతతికి చెందిన గర్భిణీ మృతి.. టీనేజ్ డ్రైవర్ అరెస్ట్

సిడ్నీలోని హోర్న్స్‌బీ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ మృతిచెందారు. ఆమె 8  నెలల గర్భిణి అని, ప్రమాదంలో కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని 9 న్యూస్ రిపోర్ట్ చేసింది. శుక్రవారం నాడు తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కొన్ని రోజుల్లోనే రెండవ బిడ్డ పుడుతుందని సంతోషంగా ఉన్న సమయంలో కుటుంబంలో విషాదం నెలకొంది

ఏఐని గుడ్డిగా నమ్మకండి.. గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ వార్నింగ్..

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ చెప్పే ప్రతి సమాధానాన్ని గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ మోడళ్లలో కూడా లోపాలు ఉంటాయని.. కాబట్టి ఇతర టూల్స్‌తోనూ ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఏఐ బుడగ పేలితే.. అన్ని కంపెనీలపైనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

అమెరికా కాలేజీల్లో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..

అమెరికాలోని యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా పడిపోయింది.“ఓపెన్ డోర్స్” గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో భారత విద్యార్థుల రిజిస్ట్రేషన్లు 10 శాతానికి పడిపోయిందని వెల్లడించింది.2024–25 విద్యా సంవత్సరంలో మెుత్తం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు 17 శాతం 2025లో తగ్గినట్లు డేటా వెల్లడించింది. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణంగా వీసా జారీలో జాప్యం, కఠినమైన విధానాలు, అమెరికాకు ప్రయాణ పరిమితులను కారణాలుగా పేర్కొన్నాయి. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్న ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తేలింది

క్లౌడ్ ఫ్లేర్ లో అంతరాయం

ఇంటర్నెట్‌లో వేలాది వెబ్‌సైట్లకు సెక్యూరిటీ, స్పీడ్ సేవలు అందించే Cloudflare నేడు కొంతసేపు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఈ కారణంగా కొన్ని వెబ్‌సైట్లు ఓపెన్ కాకపోవడం, పేజీలు చాలా స్లోగా లోడ్ అవ్వడం కనిపించింది.యూజర్లు “Error 500”, “Site Not Working”, “Try Again Later” వంటి మెసేజ్‌లు చూసి సోషల్ మీడియాలో సమస్యను పంచుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

పెళ్లి రోజే మరణ శిక్ష.. ఉద్దేశపూర్వకంగానే తీర్పు తేదీని మార్చారా..?

ఆమె పెళ్లి రోజు చివరకు జీవితంలో చీకటి రోజుగా మారింది. ఢాకా అల్లర్లకు బాధ్యురాలిగా ఆమెకు అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) కోర్టు సోమవారం నవంబర్ 17న మరణ శిక్ష విధించింది. సరిగ్గా 58 ఏళ్ల క్రితం ఇదే రోజు హసీనా వివాహం జరిగింది. 1,400 మంది మృతికి కారణమయ్యారని మాజీ ప్రధానికి పెళ్లిరోజు ఉరి ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె పశ్చాత్తాపం పడాలనే ఉద్దేశంతోనే తీర్పు తేదీని నవంబర్ 14 నుంచి 17కు మార్చారని పలువురు […]

మక్కా – మదీనాలో మరణిస్తే మృతదేహాన్ని ఎందుకు ఇవ్వరు?

హజ్-ఉమ్రాకు సంబంధించి సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం, మక్కా, మదీనా లేదా సౌదీ అరేబియాలో మరెక్కడైనా తీర్థయాత్ర సమయంలో ఒక యాత్రికుడు మరణిస్తే, వారి మృతదేహాన్ని వారి దేశానికి తిరిగి అప్పగించడానికి అనుమతి లేదు. ప్రతి యాత్రికుడికి ప్రయాణం ప్రారంభించే ముందు దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. సౌదీ హజ్ చట్టం ప్రకారం హజ్ – ఉమ్రా మతపరమైన తీర్థయాత్రలు, బీమా ఆధారిత ప్రభుత్వ సేవలు కావు. అందువల్ల, తీర్థయాత్ర సమయంలో మరణానికి సౌదీ ప్రభుత్వం ఎటువంటి […]

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష ఖరారు

ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు.. షేక్‌ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది గత ఏడాది జులై – ఆగస్టులో విద్యార్థుల నిరసనల అణచివేత సమయంలో దాదాపు 1400 మంది మృతిచెందారని ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని షేక్‌ హసీనా ఆదేశాలు ఇచ్చారని […]

AI భవిష్యత్తుపై సత్య నాదెళ్ల వ్యాఖ్యలు

ప్రతి కంపెనీకి తమకంటూ స్వతంత్ర AI వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. టెక్ రంగం ‘జీరో స‌మ్ గేమ్’గా మారకూడదని, ఏఐ కారణంగా ఏర్పడే ఆర్థిక లాభాలు కొందరు టెక్ దిగ్గజాలకే పరిమితమవ్వకుండా అన్ని సంస్థలకు చేరే విధంగా వాతావరణం ఏర్పడాలి అని సూచించారు. నాదెళ్ల చేసిన ఈ దీర్ఘ పోస్టుకు ఎలాన్ మస్క్ మాత్రం ఒక్క ‘ఫేస్‌పామ్’ ఎమోజీతోనే స్పందించారు. ఈ ఒక్క ఎమోజీతోనే మస్క్ తన అసమ్మతి తెలిపాడా? లేక మరో […]

నేరగాళ్లు హీరోలు అవుతున్నారు.. నేను దేనికీ భయపడను : హసీనా

బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా అమానుష చర్యలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వేళ హసీనా తాజాగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన రోపణలను హసీనా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు అంటూ ఆరోపించారు. యూనస్‌ అధికారాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON