loader

మరో కేసులో దోషిగా షేక్‌ హసీనా.. ఐదేళ్ల జైలుశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకా లోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది.

ఇండోనేషియాలో 442కు చేరిన మృతుల సంఖ్య

సెనార్ తుఫాన్‌తో ఇండోనేషియా అత‌లాకుత‌ల‌మైంది. ఆ తుఫాన్ వ‌ల్ల సుమారు 442 మంది మ‌ర‌ణించారు. భారీ వ‌ర‌ద‌లు పెను న‌ష్టాన్ని క‌లిగించాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. థాయ్‌ల్యాండ్‌, మ‌లేషియాలో కూడా విధ్వంసం జ‌రిగింది. థాయ్‌లో సుమారు 170 మంది మ‌ర‌ణించారు. సైనార్ తుఫాన్‌తో దెబ్బ‌తిన్న ఇండోనేషియాలో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. సుమ‌త్ర దీవుల్లో న‌ష్టం భారీగా ఉన్న‌ది. వేలాది మందికి ఆహారం అంద‌డం లేదు ఆహారం, నీళ్ల కోసం లూటీ జ‌రుగుతున్న‌ట్లు అధికారులు చెప్పారు.

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్య.!

బ్రిటన్‌లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హరియాణాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ అనే 30 ఏళ్ల విద్యార్థి యూకేలో విద్యనభ్యసిస్తున్నాడు. నవంబర్ 25న కొందరు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఓర్సెస్టర్‌లోని బార్బోర్న్ సమీపంలో అతడిపై దాడి జరిగింది.ఈ ఘటనలో విజయ్‌ ఒంటిపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

భారత ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 మేలో అమలు చేసిన అధిక టారిఫ్‌ విధానాల ప్రభావం భారత ఎగుమతులపై గణనీయంగా పడింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, మే నుండి అక్టోబర్ 2025 మధ్యకాలంలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే మొత్తం ఎగుమతులు సుమారు 28.5% తగ్గాయి. దీనివల్ల దేశంలోని ఎగుమతి ఆధారిత పరిశ్రమలు గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

శ్రీలంకలో దిత్వా తుపాను దెబ్బకు 123 మంది బలి

దిత్వా తుపాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సహా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇప్పటివరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది ఆచూకీ గల్లంతైంది. 35 శాతం గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించింది. శుక్రవారం కెలాని నది ఒడ్డు మునిగిపోయిందని, వందల మందిని తాత్కాలిక పునరావాసాలకు తరలించామని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాజియాకు తీవ్ర అస్వస్థత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(80) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆదివారం రాత్రి ఢాకా లోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బిఎన్‌పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంఘీర్ వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ ప్రత్యేక ప్రార్థనలు చేసింది.

పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ ఖరారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4-5 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా నాయకుడిని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు.

లొంగిపోయిన పాలస్తీనియన్‌లను కాల్చిచంపిన ఇజ్రాయెల్‌..

లొంగిపోయిన ఇద్దరు పాలస్తీనియన్‌లను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ దగ్గర ఆయుధాలు లేవన్న సంకేతంతో చేతులెత్తి లొంగిపోయిన తర్వాత వారిని కాల్చి చంపారని, ఇది ‘కోల్డ్ బ్లడ్ హత్య’ అని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అరబ్ టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

UAE బిగ్ షాక్.. పాకిస్తానీయులకు వీసాల రద్దు..

పాకిస్తాన్‌కు ఓ ముస్లిం దేశమే గట్టి షాక్ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. యుఎఇలో పెరుగుతున్న నేరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు అంతర్గత కార్యదర్శి సల్మాన్ చౌదరి యుఎఇ పాకిస్తానీలకు వీసాలు జారీ చేయడం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ సెనేట్ మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా ముంతాజ్ జెహ్రీ మాట్లాడుతూ, పాకిస్తానీయులు యుఎఇలో నేరాలకు […]

ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 6.3 తీవ్రతతో భూకంపం..

ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవులకు మరో ఉపద్రవం వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా తుఫాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న సుమత్రా దీవుల్లో ఇప్పుడు భూకంపం సంభవించింది. ఈ రోజు (గురువారం) ఉదయం 6.3 తీవ్రత కలిగిన భూకంపం అక్కా ప్రాంతం సమీపంలో ఏర్పడింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, భూకంపం తీవ్రమైనది అయినప్పటికీ, సునామి ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భూకంపం వల్ల ప్రాణ, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON