ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈసారి సినిమాలపై..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన దృష్టి సినిమాలపై పడింది. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న అసమర్థ, బలహీన గవర్నర్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను 100 శాతం సుంకం విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అని ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు.