loader

41 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. మరో బాంబ్ పేల్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌  అమెరికాను  నంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్లప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైనా ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు, ప్రపంచ దేశాలపై ట్యాక్స్‌లు పెంచడం, అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపారు.. అయితే తాజాగా మరో బాంబ్ పేల్చారు. 41 దేశాల పౌరులు తమ దేశంలో అడుగు పెట్టకుండా ట్రావెల్ […]

ISIS పై అమెరికా ఉక్కుపాదం.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ ఖతం..

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబూ ఖదీజాను చంపాయని ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ తెలిపారు. అతన్ని “ఇరాక్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు” అని అభివర్ణించారు. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్ లో అతన్ని హతమార్చింది. అబు ఖదీజా, మరోటెర్రరిస్టు వాహనంప వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో వైట్ హౌస్ విడుదల చేసింది

గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాసం రాదు

గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా లో నిరంతరం ఉండలేరని, ఆ హక్కు గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఉండబోదని, అమెరికా ప్రభుత్వం తలచుకుంటే వారిని వారి దేశాలకు డిపోర్ట్ చేయొచ్చ ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి.వాన్స్ అన్నారు. అమెరికాలో అత్యధిక గ్రీన్ కా ర్డులు కలిగిన వారిలో రెండో స్థానం భారతీయుల దే. ‘అమెరికా అధ్యక్షుడు లేక విదేశాంగ కార్యదర్శి ఏ ప్రవాసి అయినా తమ దేశంలో ఉండకూడదనుకుంటే అలాంటి వారికి చట్టబద్ధంగా నివసించే హక్కు ఉండదు’ అని వాన్స్ […]

భారత్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. పాక్ ప్రధాని వింత వ్యాఖ్యలు

భారత్‌ విషయంలో పాక్ ప్రధాని సంచలన సవాల్ స్వీకరించారు. భారత్‌ను తాము ఓడిస్తామని.. ఒకవేళ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని.. అతి విశ్వాసంతో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏదో క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఏకంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను పాక్ ఓడిస్తుందని.. తలపొగరు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షెహబాజ్ షరీఫ్ పేరు మార్పు ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అమెరికా నూతన అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు. ” నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు […]

ఇకనైనా స్వేచ్ఛావాయువులు వీచాలి!

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఈ ఒప్పందం సాకారం కానున్నదనే నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. మూడు దశలలో అమలు కానున్న కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తే, ఇజ్రాయెల్ తమ జైళ్లలో బంధించిన పాలస్తీనియన్లలో కొందరిని వదిలిపెడుతుంది. రెండో దశలో గాజానుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగుతాయి. ఆపై మూడో దశలో భాగంగా […]

స్పేడెక్స్‌ డాకింగ్‌ సక్సెస్‌

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది. నూతన ఏడాదిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ (స్పేడెక్స్‌) విజయవంతమైంది. నింగిలో రెండు ఉపగ్రహాల అనుసంధానం విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఇస్రో ‘ఎక్స్‌’లో గురువారం వెల్లడించింది. ‘అంతరిక్ష చరిత్రలో భారత్‌ తన పేరును లిఖించుకున్నది.

అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత..

అదానీ గ్రూప్‌తో సహా పలు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్న అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రద్దు చేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తెలిపారు. 2023 సంవత్సరం మొదటి నెలలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న కంపెనీలపై అనేక ఆరోపణలు వచ్చాయి. తర్వాత సెబీ విచారణలో కూడా ఏమీ తేలలేదు.  హిండెన్‌బర్గ్ నివేదికను గ్రూపును అస్థిరపరిచేందుకు మాత్రమే కాకుండా రాజకీయంగా భారతదేశాన్ని […]

2024లో ఆగని కొలువుల కోత : 1,30,000 మంది టెకీలపై వేటు

జాబ్‌ కట్స్‌ ట్రెండ్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది.ఐటీ పరిశ్రమ ఆర్ధిక సవాళ్లు కొనసాగడం, మార్జిన్ల ఒత్తిళ్లు, వ్యయ నియంత్రణ చర్యలతో టెక్‌ కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ 397 కంపెనీలు 1,30,482 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ డేటా వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON