loader

మౌంట్‌ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు వేల అడుగుల ఎత్తులో ఈ తుఫానులో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకూ దాదాపు 350 మందిని రక్షించినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్‌ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వారంతా చిక్కుకుపోయినట్లు చైనా మీడియా పేర్కొంది.

ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఉన్న ‘ఇన్వర్షన్’ సంస్థ అంతరిక్ష రంగంలో కొత్త అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ ‘ఆర్క్’ ను ఆవిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వాహనం ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఏ ప్రాంతానికైనా ఒక గంటలోపు వస్తువులను డెలివరీ చేయగల సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘ఆర్క్’ (RK) వాహనం పొడవు 8 అడుగులు, వెడల్పు 4 అడుగులు ఉండి పెద్ద టేబుల్‌టాప్ పరిమాణంలో ఉంటుంది.

మరోసారి మా జోలికి వస్తే దెబ్బకు దెబ్బే.. పాక్ మంత్రి హెచ్చరికలు

మరోసారి తమపైకి సైనిక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతదేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు వెలువరించారు. పాకిస్థాన్‌తో సైనిక దుస్సాహాసానికి దిగితే తాము ఈసారి ఘాటైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతామని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనిక దళాల చీఫ్ ద్వివేదిలు వేర్వేరుగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ రెండో దశ ఉంటుందని ప్రకటించారు.

నేను చెప్పినట్టు చేయకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హమాస్‌కు తుది హెచ్చరిక చేశారు. తాను సూచించినట్టు గాజాపై హమాస్ తన అధికారాన్ని వదులుకోకపోతే భూమ్మీద లేకుండా పోతుందని హెచ్చరించారు. గాజాపై దాడుల నిలిపివేతకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ సిద్ధంగానే ఉన్నారని అన్నారు. అమెరికా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు.

ఎలోన్ మస్క్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ రూ.2 లక్షల కోట్ల నష్టం!

మస్క్, కొంతమంది నెట్‌ఫ్లిక్స్ లింగమార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, ‘వోక్ ఎజెండా’ను ప్రచారం చేస్తోందని ఆరోపించారు పిల్లల మానసిక ఆరోగ్యం కోసం, నెట్‌ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు మస్క్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత, నెట్‌ఫ్లిక్స్ షేర్లు పడిపోవడం ప్రారంభించాయి. ట్రేడింగ్ రోజులు గడిచేకొద్దీ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు తగ్గింది.

తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలకు నిధులు అందుతున్నాయని అంగీకరించిన కెనడా

కెనడా ప్రభుత్వం ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలకు నిధులు తమ దేశం నుంచే వాస్తవాన్ని తొలిసారి అధికారికంగా అంగీకరించింది.కెనడా ప్రభుత్వం ఈ విషయాన్ని తన మానీలాండరింగ్, ఉగ్రవాద ఫండింగ్ పరిశీలనలలో భాగంగా ప్రకటించింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులతో పాటు హమాస్, హెజ్‌బొల్లా వంటి సంస్థలు కూడా కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..

జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు లోతులో ఉందని వెల్లడించింది. భూకంపం ధాటికి భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. 

ఉక్రెయిన్‌ ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

సింగ‌పూర్ హోట‌ల్‌లో సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై దాడి.. ఇద్ద‌రు భార‌తీయ టూరిస్టుల‌కు జైలుశిక్ష‌

సింగ‌పూర్‌లోని హోట‌ల్‌లో సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు భార‌తీయ టూరిస్టు ల‌కు జైలుశిక్ష ప‌డింది. దాడితో పాటు దొంగ‌తనానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రికీ అయిదేళ్ల శిక్ష ఖ‌రారు చేశారు. దీంతో పాటు ఒక్కొక్క‌రికి 12 లాఠీబెబ్బ‌ల శిక్ష కూడా వేశారు. నిందితుల‌ను 23 ఏళ్ల అర‌క్కొయిసామి డైస‌న్‌, 27 ఏళ్ల రాజేంద్ర‌న్ మైల‌ర‌స‌న్‌గా గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON