వాట్సాప్ కు పోటీగా అరట్టై డౌన్లోడ్ చేసేముందు ఇవి తెలుసుకొండి
అరట్టైలో ఎలాంటి మొబైల్ నంబర్ లేకుండా చాట్ చేయవచ్చు. ప్రత్యేక మీటింగ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. ఇది స్లో ఇంటర్నెట్‌లో కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను క్లౌడ్‌లో సురక్షితంగా సేవ్ చేస్తుంది. అంటే పొరపాటున డిలీట్ అయిన సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. ప్రస్తుతం ‘అరట్టై’ యాప్‌లో కొన్ని ఫీచర్లు లేవు. చాట్‌లను లాక్ చేయడం, డిజప్పియరింగ్ మెసేజ్‌లు, చాట్ ఎక్స్‌పోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లాంటివి ఇందులో అందుబాటులో లేవు.