loader

మైక్రోసాఫ్ట్‌లో 5 నెలల్లో 7లక్షల జాబ్స్ కట్..

ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగాల్లో కోతలు విధించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్లీ లేఆఫ్స్ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లాభదాయకతను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక మార్పుల కారణంగా.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తోంది.

ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు.. తొలి భారతీయుడిగా రికార్డు

ISRO(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) వ్యోమగామి శుభాంశు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. భారత అంతరిక్ష చరిత్రలో గర్వించదగ్గ మైలురాయిని నమోదు చేశాడు. ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచాడు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ సాయంత్రం 4.03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేసింది.

శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో 3 మంది ప్రయాణికులతో కూడిన ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి బయలుదేరింది.ఈ మిషన్ సరిగ్గా మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. SpaceX కొత్త డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి బయల్దేరింది. ఈ అంతరిక్ష నౌకను కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.

ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌..

గూగుల్ యూట్యూబ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే యాప్. గూగుల్ కొంతమంది వినియోగదారులను యూట్యూబ్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయమని కోరింది. చాలా మంది ఐఫోన్ వినియోగదారులు యూట్యూబ్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నందున, దానికి పరిష్కారం కనుగొనడానికి గూగుల్ ఈ ప్రకటనను విడుదల చేసింది YouTubeను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు.

అతిపెద్ద డేటా లీక్.. హ్యాకర్ల చేతిలో 16 బిలియన్ల మంది డిజిటల్ లాగిన్ వివరాలు

తాజాగా గూగుల్, యాపిల్ అకౌంట్ల బిలియన్ల కొద్దీ లాగిన్ పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయని టెక్ రిసెర్చ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఇది టెక్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌లలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. దీని ఇంపాక్ట్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. మనం రోజురోజుకూ డిజిటల్‌ వరల్డ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీంతో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. అయితే అప్పుడప్పుడు జరిగే డేటా లీక్‌లు, హ్యాకింగ్ దాడులు మన సేఫ్టీకి పెద్ద ముప్పును కలిగిస్తున్నాయి.

వాట్సాప్‌లో ChatGPT ఇమేజ్ జనరేషన్ ఫీచర్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) పాపులర్ అయింది. వాట్సాప్‌లో చాట్‌జీపీటీని వాడుకోవచ్చనే విషయం మీకు తెలుసా? ఇప్పటికే వాట్సాప్‌లో సేవలను మొదలు పెట్టిన చాట్‌జీపీటీ.. మరిన్ని ఫీచర్లను తీసుకొస్తోంది.తాజాగా ఇమేజ్ జనరేషన్ టూల్‌ను ఫ్రీగా అందిస్తోంది.

దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టోక్యో తర్వాత రెండవ సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు మళ్లీ బ్రేకులు..

భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి ప్రయాణం ఆలస్యం కాగా.. స్పేస్ ఎక్స్ యాక్సియమ్ మిషన్ 4 (యాక్స్-4) అంతరిక్ష యాత్ర తాజాగా జూన్ 22వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ జాప్యానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించడం కోసం నాసాకు అదనపు సమయం అవసరం కావడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ మూడు రంగాల్లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు

ప్రపంచ యువతకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సవాల్ గా మారుతోంది. ఏఐ వల్ల ప్రభావితం కాని మూడు రంగాలు డైనమిక్ వాతావరణాలలో శారీరక శ్రమతో చేయాల్సిన పనులు AI చేయడం సాధ్యం కాదు. డిజైనర్లు, కళాకారులు, వ్యూహకర్తలు , రచయితలు వంటి సృజనాత్మకత ,సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సిన వృత్తులు కూడా ఆటోమేషన్‌కు ప్రభావితం అయ్యే తక్కువ అవకాశం కలిగి ఉంటాయి. AI అభివృద్ధి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ , నైతిక AI పర్యవేక్షణలో కొత్త ఉద్యోగాలు […]

ట్రంప్ మొబైల్! సెప్టెంబర్‌లో T1 ఫోన్‌ రిలీజ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థ “ట్రంప్ మొబైల్”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ట్రంప్ సంస్థ కింద ఈ మొబైల్ సేవ, వైర్‌లెస్ సేవతో సంప్రదాయవాద వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ సెల్ఫ్-బ్రాండెడ్ మొబైల్ సర్వీస్ ప్రధాన టెలికాం ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నుంచి స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్ సెప్టెంబర్ 2025లో విడుదల అవుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON