loader

మైక్రోసాఫ్ట్‌లో పది వేల మందిపై వేటు

మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాదాపు పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలిగించింది. ఎక్స్‌బాక్స్, గేమింగ్ యూనిట్లలో కోతలు ఎక్కువ అయ్యాయి. ఇంటెల్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 20 శాతం మేర తమ ఉద్యోగ శక్తిని తగ్గించుకుంది. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల్లో 4 శాతం మంది వరకూ లే ఆఫ్‌ల ఊబిలో చిక్కారు. తమ సంస్థలో కొన్ని విభాగాలలో ఉద్యోగాలకు కోత అవసరం అయిందని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలోని తమ ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను కూడా మూసివేస్తున్నారు.

రైతన్నలను వదలని సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను కూడా టార్గెట్ చేయడం ప్రారంభించారు. అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పీఎం కిసాన్ యాప్ పేరుతో సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. పీఎం కిసాన్యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కేంద్రం నుంచి నేరుగా రూ.6,000 ఖాతాలో జమ అవుతాయని సైబర్ నేరగాళ్లు  వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఈ నకిలీ సమాచారాన్ని విశ్వసించి క్లిక్ చేస్తే వారి  కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది.

ఓవర్ టైమ్ చేయొద్దు- ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఉద్యోగులు పని గంటలు అయ్యాక అదనంగా పని చేయొద్దని సూచిస్తూ వ్యక్తిగత ఈ-మెయిల్స్ పంపుతోంది. పని వేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని చెబుతోంది. అయితే, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గతంలో వారానికి 70 గంటలు పని చేయాలని చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు వచ్చాయి.

ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రారంభించిన భారత ప్రభుత్వం

పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) 2.0లో భాగంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లను (e-passports) అధికారికంగా ప్రారంభించింది. పాస్‌పోర్ట్ సేవలను మెరుగుపరచడం, భద్రతను పెంచడం, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ-పాస్‌పోర్ట్ అనేది సాంప్రదాయ పాస్‌పోర్ట్‌కు ఎలక్ట్రానిక్ వెర్షన్. ఇందులో సురక్షితమైన RFID చిప్ పొందుపరుస్తారు. ఈ చిప్ పాస్‌పోర్ట్ హోల్డర్ ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఇతర వ్యక్తిగత సమాచారంతో సహా బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా నిల్వ చేస్తుంది.

సెల్ఫ్ డ్రైవ్‌ చేసుకుంటూ యజమానికి ఇంటికి చేరిన కారు

డ్రైవర్‌లెస్‌ కారు కల సాక్షాత్కారమైంది. ఓ కారు దానికదే పూర్తి స్థాయిలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్ల మీద పరుగులు పెట్టింది. అమెరికాకు చెందిన టెస్లా మొట్టమొదటి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు రోడ్ల మీద పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘టెస్లా మోడల్‌ వై’ పేరుతో డ్రైవర్‌లెస్‌ కారును తాయరు చేసింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు దాటుకుంటూ యజమాని ఇంటికి దానికదే డెలివరీ అయింది.

అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం..

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుందిని లోకేష్‌ అన్నారు.

వరల్డ్ సోషల్ మీడియా డే

2010లో, కమ్యూనికేషన్ మరియు ప్రపంచంతో మనం సంభాషించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేసిన సోషల్ మీడియా యొక్క అద్భుతమైన రంగాన్ని జరుపుకోవడానికి Mashable జూన్ 30న సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా మన జీవితాలను విస్తృతంగా మార్చివేసింది మరియు ప్రజలను ఒకచోట చేర్చింది 1997లో ప్రారంభించబడిన ‘సిక్స్ డిగ్రీస్’ మొదటి సోషల్ మీడియా సైట్‌గా పరిగణించబడుతుంది.

క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలి : చంద్రబాబు

అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటం వ్యాలీ అలాగని,  క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు అని క్వాంటం కంప్యూటింగ్ ను ప్రమోట్ చేసేందుకు ముందుంటానని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలని సూచించారు. తమతో కలిసి వచ్చిన టిసిఎస్, ఐబికి, ఎల్ అండ్ టికి అభినందనలు తెలియజేశారు.

వరల్డ్ సోషల్ మీడియా డే

2010లో, కమ్యూనికేషన్ మరియు ప్రపంచంతో మనం సంభాషించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేసిన సోషల్ మీడియా యొక్క అద్భుతమైన రంగాన్ని జరుపుకోవడానికి Mashable జూన్ 30న సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా మన జీవితాలను విస్తృతంగా మార్చివేసింది మరియు ప్రజలను ఒకచోట చేర్చింది 1997లో ప్రారంభించబడిన ‘సిక్స్ డిగ్రీస్’ మొదటి సోషల్ మీడియా సైట్‌గా పరిగణించబడుతుంది.

నేషనల్ హైవేపై ఏఐ సిస్టమ్..

ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థ ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు, 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి వెంటనే ఈ-చలాన్ పోర్టల్‌కు అందిస్తుంది. హై రిజల్యూషన్ కెమెరాలు, డిజిటల్ బ్రెయిన్ కమాండ్ సెంటర్ ఇందులో కీలక భాగాలుగా ఉంటాయి. ఈ ఏఐ వ్యవస్థను క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON