loader

నేడు భూమికి భయలుదేరనున్న వ్యోమగాములు

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సోమవారం (జులై 14న) 18 రోజుల ఆక్సియం4 స్పేస్ మిషన్ యాత్ర ముగించుకొని ఆయన తిరిగి భూమి మీదకు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ నుంచి తన చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్‌ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నమ్మకమైన, నిర్భయమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోంది అన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ శుభాన్షు శుక్లా […]

గ‌గ‌న్‌యాన్‌కు చెందిన కీల‌క ప‌రీక్ష‌ విజ‌య‌వంతంగా పూర్తి

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన కీల‌క ప‌రీక్ష‌ను ఇస్రో(ISRO) విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. స‌ర్వీస్ మాడ్యూల్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను పూర్తిగా డెవ‌ల‌ప్ చేసిన ఇస్రో.. క్వాలిఫికేష‌న్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా స‌ర్వీస్ మాడ్యూల్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను స‌మ‌గ్రంగా ప‌రీక్షించింది. ఎస్ఎంపీఎస్‌కు చెందిన 350 సెక‌న్ల ఫుల్ డ్యూరేష‌న్ హాట్ టెస్ట్‌ను శుక్ర‌వారం పూర్తి చేశారు.హాట్ టెస్ట్ స‌మ‌యంలో ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింద‌ని ఇస్రో ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

జులై 15న భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా

యాక్సియం-4 మిషన్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు జులై 14న తిరుగు ప్రయాణం చేపడుతున్నట్లు నాసా గురువారం ప్రకటించింది. జులై 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడా తీరంలో ల్యాండ్‌ కానున్నారు. అయితే, వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇస్రో తాజాగా తెలిపింది.

భారతీయుల కోసం భారీ ఆఫర్‌ ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌..!

భారతీయుల కోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ భారతదేశంలోని తన వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్ ఫీజులను గణనీయంగా తగ్గించిందని నివేదికలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 48 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మొబైల్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.900 నుండి రూ.470కి వెబ్ ఖాతాలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.650 నుండి రూ.427కి తగ్గించింది

అంతరిక్షంలో వ్యవసాయంపై ఇస్రో స్పెషల్‌ కోర్సు..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. IN-SPACe, అకడమిక్‌ పార్ట్‌నర్స్‌తో కలిసి ‘ఎసెన్షియల్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్’ అనే షార్ట్‌టర్మ్‌ కోర్స్‌ని లాంచ్‌ చేసింది. 2025 జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో కోర్స్‌ అందిస్తారు స్పేస్‌ టెక్నాలజీ వ్యవసాయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో జ‌పాన్ సంచ‌ల‌నం

జ‌పాన్‌లో ఇప్పుడు ఇంట‌ర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను ఆ దేశం రూపొందించింది. ఒక సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో (At petabit speeds)ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని క‌నుగొన్నారు.జ‌పాన్‌లో ఆ వేగంతో కేవ‌లం సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. భార‌త్‌తో పోలిస్తే జ‌పాన్‌లో బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ స్పీడ్ 16 మిలియ‌న్ల సార్లు ఎక్కువ అని తెలిసింది.

టీసీఎస్ ఉద్యోగులను వెంటాడుతున్న భయం..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి క్లయింట్ డీల్ వాయిదాలు, ఒప్పందాల ఆలస్యం వంటి అంశాల వల్ల సాలరీ రివిజన్‌ గురించి తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. TCS సాధారణంగా ఏప్రిల్ 1న జీతం పెంపు ప్రక్రియను, ఉద్యోగులకు సాలరీ ఇన్క్రిమెంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఉద్యోగులు ఆందోళనలో […]

సిలికాన్ వ్యాలీలో మరో ఇండియన్ జెండా

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఈ నెలాఖరులో ఈ పదవిని స్వీకరిస్తారు.జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సబీఖాన్ భారత సంతతి వ్యక్తి. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది, ఆ తర్వాత వారు యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడ్డారు

ఐఎస్ఎస్‌ ఐకానిక్ ప్రదేశంలోకి శుభాన్షు శుక్లా

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోని ప్రసిద్ధ కుపోలా విండోలోకి ప్రవేశించారు. అందులో నుంచి బయటకు చూస్తూ శుక్లా చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 14 రోజుల అంతరిక్ష యాత్ర చివరి దశలో శాస్త్రీయ ప్రయోగాల్లో శుక్లా నిమగ్నమయ్యారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా.. ఐఎస్ఎస్‌లో ప్రవేశించిన మొదటి ఇండియన్‌గా శుక్లా చరిత్ర సృష్టించారు.

AI వీడియోలు ఇక చెల్లవు!మీ యూట్యూబ్‌ ఛానెల్ భవిష్యత్తు ఏంటీ

యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బులు సంపాదించే వాళ్లకు బిగ్ అలర్ట్.ఇకపై వ్యూస్ కోసం చేసే వీడియోలపై కఠినంగా వ్యవహరించాలని గూగుల్ నిర్ణయించింది. ఒకే విధమైన లేదా ఏఐ సహాయంతో కంటెంట్‌ను తయారుచేసే క్రియేటర్స్‌పై కొరడా ఝుళిపించనున్నారు. ఈ మార్పు జులై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఒరిజినల్స్‌ను ప్రోత్సహించనుంది. కేవలం వ్యూస్ కోసం తయారు చేసిన వీడియోలను గుర్తించి వాటి రీచ్‌ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON