loader

లింక్‌పై క్లిక్ చేస్తే కేంద్రం 46,715 సాయం..

ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ప్రతి ఒక్కరికి రూ.46,715 సాయం అందిస్తోంది. దీన్ని కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ కేటుగాళ్లు కొత్త స్కామ్‌కు తెరదీశారు.  కొన్ని రోజులుగా ఓ లింక్ వాట్సాప్ లో తెగ వైరల్ అయ్యింది. పలువురు దీనిని నమ్మి లింక్‌పై క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ లింక్‌పై క్లిక్ చేయొద్దని ,గ్రూపుల్లో షేర్ చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. […]

Chat GPT ని వెనక్కి నెట్టి న Perplexity AI

దేశంలో ఇప్పటి వరకు Chat GPT మాత్రమే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన AI యాప్ గా వెలుగొందుతోంది. అయితే, ఎఐ వరల్డ్ లోకి కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్త సెన్సేషన్ గా అవతరించింది. మొన్నటి వరకు యాపిల్ యాప్ స్టోర్ లో చాట్ జిపిటి మాత్రమే అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన ఎఐ యాప్ గా ఉండగా, నిన్న ఎయిర్టెల్ ప్రకటించిన ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సర్వీస్ ఆఫర్ తర్వాత యాపిల్ స్టోర్ లో భారీగా డౌన్లోడ్స్ సాధించి […]

మెటా ఏఐ మిషన్.. సూపర్ క్లస్టర్లతో మేధో విప్లవానికి రంగం సిద్ధం!

మెటా ప్రణాళికలో తొలి మెరుగైన క్లస్టర్ పేరు ‘Prometheus’ దీని సామర్థ్యం 1341 మెగావాట్లు. ఏఐ మోడళ్లను నిర్మించాలంటే వేలాది గంటల గణన, డేటా శిక్షణ అవసరం అవుతుంది. దీన్ని సాధారణ కంప్యూటర్లతో చేయడం అసాధ్యం. అందుకే సూపర్ క్లస్టర్లు, అంటే భారీ శక్తితో పని చేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి.ఏఐ మోడళ్ల శిక్షణకు సాధారణంగా 12-14 మెగావాట్ల శక్తి అవసరం అవుతుంది. కానీ మెటా అభివృద్ధి చేస్తున్న క్లస్టర్ మాత్రం దానికి పన్నెండు రెట్లు […]

రీల్ చేయండి.. రూ.15వేలు గెలుచుకోండి.. కేంద్రం బంపర్ ఆఫర్

డిజిటల్ ఇండియా.. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామాల నుండి నగరాల దాకా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చింది. డిజిటల్ ఇండియా చేపట్టి 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రభుత్వం డిజిటల్ ఇండియా దశాబ్దం-రీల్ పోటీ అనే ప్రత్యేకమైన పోటీని ప్రారంభించింది. ఈ పోటీ జూలై 1న ప్రారంభమవ్వగా.. ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. రీల్ కనీసం 1 నిమిషం నిడివి ఉండాలి. వీడియో ఒరిజినల్‌గా ఉండాలి. ఇంతకు ముందు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ […]

విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. జెమిని AI ప్రో ఇప్పుడు ఫ్రీ

టెక్‌ జెయింట్‌ గూగుల్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఒక బంపరాఫర్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన విద్యార్థుల స్కిల్స్ పెంచేందుకు, ఏడాది పాటు జెమిని AI ప్రో (Gemini Pro) సూట్‌ను ఉచితంగా అందిస్తోంది. 2025 సెప్టెంబర్ 15లోపు రిజిస్టర్ చేసుకున్న 18 ఏళ్లు పైబడిన స్టూడెంట్స్ అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. AI టెక్నాలజీతో వేగంగా నేర్చుకోవడం, కాలేజీ ప్రాజెక్టులను ఈజీగా చేయడం, ఫ్యూచర్‌కి అవసరమైన స్కిల్స్‌ను నేర్చుకుని కెరీర్‌లో దూసుకెళ్లేలా స్టూడెంట్స్‌కు సపోర్ట్ […]

భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు తిరిగి భూమికి చేరుకుంది. స్పేస్ నుంచి సోమవారం డ్రాగన్‌ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

అంతరిక్షంలో హెయిర్ కట్ చేయించుకున్న శుభాన్షు శుక్లా

అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో హెయిర్‌కట్ చేయించుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. భూమికి దూరంగా గురుత్వాకర్షణ లేని వాతావరణంలో జుట్టు కత్తిరించడం అనేది ఒక సంక్లిష్టమైన పని. కత్తిరించిన వెంట్రుకలు తేలియాడి.. అంతరిక్ష కేంద్రంలోని సున్నితమైన పరికరాలలో, ప్రాణ వాయువు వ్యవస్థలలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి వ్యోమగాములు ప్రత్యేకమైన వాక్యూమ్ క్లిప్పర్‌లను ఉపయోగిస్తారు. ఇవి జుట్టును కత్తిరించిన వెంటనే వాటిని లోపలికి పీల్చుకుంటాయి.ఎంతో జాగ్రత్తగా నికోల్ అయర్స్ ముగ్గురు వ్యోమగాములకు […]

ఒక్క రూపాయికే న్యాయ సలహా.. ప్రత్యేకంగా యాప్

న్యాయపరమైన సమస్యలతో సతమతమయ్యే వారికి జనగామ జిల్లాకు చెందిన యువకుడు ఆదర్శ్ అద్భుతమైన పరిష్కారం చూపారు. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి CLNS.in వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఈ బృందం.. ఈ ఏడాది మేలో అదే పేరుతో ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. కేవలం ఒక్క రూపాయికే న్యాయ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. CLNS దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేసుకుని, ఇప్పటివరకు 3 వేల మందికి పైగా ప్రజలకు సాయం అందించినట్లు ఆయన […]

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్‌ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని రక్షించారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

డ్రాగన్ క్రూ అన్‌డాకింగ్ సక్సెస్.. అంతరిక్షం భూమికి బయలుదేరిన శుభాన్షు శుక్లా

18 రోజులు పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా నలుగురు భూమికి తిరుగు పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ కాప్సూల్ విడిపోయింది. అనంతరం భూమి దిశగా పయనం ప్రారంభించింది. 22 గంటల ప్రయాణం అనంతరం ఈ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం (జూలై 15) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా తీరంలో దిగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON