ఈయూలో అక్టోబర్ నుంచి రాజకీయ ప్రకటనలు బంద్.. ప్రకటించిన మెటా కంపెనీ
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృతసంస్థ మెటా అక్టోబర్ నుంచి యూరోపియన్ యూనియన్ (EU)లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచారాలలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో కొత్తగా అమలు చేయనున్న ఈయూ నియమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ వెల్లడించింది. ఈ నియమాలు తమ ప్రక్రియ, వ్యవస్థలపై చాలా అదనపు బాధ్యతలను విధిస్తున్నాయని, ఇది ప్రకటనదారులు, ప్లాట్‌ఫారమ్‌లు ఈయూలో పనిచేయడం చట్టబద్ధంగా చాలా క్లిష్టంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.