loader

సత్య నాదెళ్లను హెచ్చరించిన మస్క్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI తాజాగా తీసుకొచ్చిన GPT-5 అధికారిక ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఓపెన్‌ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్….రీపోస్టింగ్ బటన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్‌ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు- TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1 నుండి జీతాలు పెంచుతున్నట్లుగా ఉద్యోగులకు మెయిల్స్ పంపుతోంది. ఈ జీతాల పెంపులో సుమారు 80 శాతం మంది ఉద్యోగులు ఉంటారని, ముఖ్యంగా జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులకు  వర్తిస్తుందని టీసీఎస్ వెల్లడించింది. 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన కొన్ని రోజులకే టీసీఎస్ ఈ జీతాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్యతో కంపెనీ తన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలని […]

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌..

వాట్సాప్ తాజాగా తీసుకవచ్చిన “సేఫ్టీ ఓవర్‌వ్యూ (Safety Overview)”అనే ఫీచర్ ను తీసుకవచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారునికి తమను ఎవరు గ్రూప్‌లో జోడించారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు గ్రూప్‌కి జోడిస్తే అప్రమత్తం చేస్తుంది. గ్రూప్ గురించి సమాచారంతో పాటు, సురక్షితంగా ఉండటానికి చిట్కాలు కూడా అందిస్తోంది. అలాగే, గ్రూప్‌లో ఎవరైనా సభ్యుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారో లేదో కూడా మీరు చూడగలరు.

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అలర్ట్

ఆగస్టు 1 నుండి UPI నియమాలు మారబోతున్నాయి. రోజుకు 50 సార్ల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తనిఖీ చేయలేరు. UPI ఆటో-పే లావాదేవీలు (బిల్లు చెల్లింపులు, EMIలు, సబ్‌స్క్రిప్షన్‌లు వంటివి) ఇకపై నిర్దిష్ట సమయాలలోనే జరుగుతాయి. , ఈ సమయాలు ఉదయం 10 గంటల ముందు, లేదా మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. రాత్రి 9:30 తర్వాత ఒక స్లాట్ నిర్ణయిస్తారు. సాధారణ వినియోగదారులు గతంలో లాగే రోజువారీ బిల్లు చెల్లింపులు, […]

ఆస్ట్రేలియా స్పేస్ ప్రాజెక్ట్ తొలి ప్రయత్నం విఫలం

ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా భావించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ‘ఎరిస్’ రాకెట్ తన మొదటి పరీక్షా ప్రయోగంలో కేవలం 14 సెకన్లలోనే విఫలమవడం దేశానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ ఘటన క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్‌పోర్ట్‌లో చోటుచేసుకోగా, రాకెట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఆకాశాన్నంటాయి.

విజయవంతంగా నింగిలోకి నిసార్ ఉపగ్రహం..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ( NASA ), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం సాయంత్రం నింగిలోకి పంపారు. 26.30 గంటల కౌంటర్ డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్ 16 రాకెట్ బుధవారం సాయంత్రం 5.40 గంటలకు నాసా- ఇస్రో సింథటిక్ అపార్చర్ ‌ను మోసుకెళ్లింది. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 18 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి […]

ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేసిన తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి వీడియోను చూసిన వెంటనే ఫార్వార్డ్ చేయకూడదని సూచించారు. మార్ఫింగ్ వీడియోలు అధికంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖుల వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. “సోషల్ మీడియాలోని ప్రతి వీడియో నిజం కాదు. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయవద్దు” అని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.డీప్ ఫేక్ టెక్నాలజీ తో తప్పుడు ప్రచారాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఇవి విద్వేషాలను […]

నో శాలరీ హైక్స్‌, సీనియర్ల నియామకాలు నిలిపివేత.. ఉద్యోగులకు టీసీఎస్‌ మరో షాక్‌

లేఆఫ్స్‌ ప్రకటన అనంతరం టీసీఎస్‌ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కొత్త ఉద్యోగ నియామకాలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా పుల్ స్టాప్ పెట్టినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

TCS కఠిన నిర్ణయం.. 12 వేల మంది ఉద్యోగాలు ఊస్టింగ్‌

సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది.ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 12,200 ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలిపింది. “మా క్లయింట్లకు అందించేసేవలపై ఎటువంటి ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి ఈ ప్రక్రియను తగిన జాగ్రత్తతో ప్లాన్ చేస్తున్నాం” అని కంపెనీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON