వాట్సాప్ షాకింగ్ నిర్ణయం..నెలకు మెసేజ్‌ల సంఖ్యపై పరిమితులు..!
ప్రమోషనల్, బల్క్ మెసేజ్‌లు పంపే వారిని నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఒక బిజినెస్ యూనిట్‌కు 10 మెసేజ్‌ల పరిమితి ఇస్తే గనుక.. రిప్లై ఇవ్వకుండా కేవలం 10 మెసేజ్‌లు మాత్రమే పంపే వీలుంటుంది. మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి నుంచి మీకు 3 మెసేజ్‌లు వచ్చాయనుకోండి. వాటికి మీరు రిప్లై ఇవ్వని పక్షంలో ఆ పరిమితి ఇంకా తగ్గుతుంది. ఆ లిమిట్ పూర్తయితే.. అటునుంచి మెసేజ్‌లు పంపే వీలుండదు.

