loader

మన సర్వం AI వచ్చేస్తోంది.. ఇక దూసుకెళ్లడమే

భారతీయ భాషలలో తార్కికతకు మద్దతు ఇచ్చే భారతదేశ ప్రాథమిక AI మోడల్ ఆరు నెలల్లో సిద్ధంగా ఉంటుందని సర్వం AI వ్యవస్థాపకులు వివేక్ రాఘవన్ చెప్పారు. అది తాము నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యమని(టైం లైన్) రాఘవన్ తెలిపారు. “వాస్తవానికి మేము భారతీయ భాషలలో(Indic languages) తార్కికతను నిర్మిస్తున్నాము” అని రాఘవన్ వెల్లడించారు. “కాబట్టి, మీరు ఏ భాషలోనైనా, ఏ లిపిలోనైనా ప్రశ్నలు అడగవచ్చు, అది దేవనాగరి లేదా రోమన్ లిపి హింద్ అయినా, మన మోడల్ ప్రతిస్పందిస్తుంది.” […]

భావాలన్నీ మన భాషలోనే..

ఆధునిక సాంకేతికత.. మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తున్నది. దేశాల హద్దులను చెరిపేస్తూ.. ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తున్నది.  యాప్‌ వాట్సాప్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అన్ని భాషలనూ మాతృభాషలోకి మార్చేసే ‘మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే చాట్‌ మెసేజ్‌లను అనువాదం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇతర దేశాల్లో పర్యటించేటప్పుడు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ‘ఆండ్రాయిడ్‌’లో నాలుగైదు నెలల నుంచే అందుబాటులో ఉన్న ఈ ‘మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’.. త్వరలోనే ఐఓఎస్‌ వినియోగదారులకూ చేరువకానున్నది.

బైబై చైనా.. ల్యాప్‌టాప్‌ కంపెనీలు ఇండియాకి క్యూ!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి.  ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్‌ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా చైనాలో తయారైన వస్తువులపై అత్యధిక పన్నుల భారం పడనుంది. దీన్ని ముందే గ్రహించిన కంపెనీలు నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ఫ్యాక్టరీలను తెరవడం ప్రారంభిస్తున్నాయి. భారతదేశాన్ని ‘సురక్షితమైన స్థావరం’గా భావిస్తున్నాయి.

ప్రపంచం 5G, చైనా మాత్రం 10G..

ప్రపంచంలో 5G నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ పరిధి చెరిపివేసింది. ఎందుకంటే, 5జి నెట్ వర్క్ ఏకంగా 1 Gbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తుంది. 50G-PON ను ఉపయోగించి హువావే మరియు చైనా యూనికామ్ సంయుక్తంగా 10G బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. చైనా ఫ్యూచర్ స్మార్ట్ సిటీగా పేరొందిన శియోంగ్‌ఆన్ (Xiong’an) ప్రాంతంలో ఈ 10G సర్వీస్ ను మొదటిగా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

భారత్‌ తొలి ఏఐ సర్వర్‌ ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం దేశపు తొలి ఏఐ సర్వర్‌ను ప్రదర్శించారు. మానేసర్‌లోని వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పార్క్‌లో ఆయన మాట్లాడుతూ… ఇందులో 8 జీపీయూలు ఉన్నాయన్నారు. అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధలో మన దేశం మంచి పురోగతి సాధిస్తున్నదని మంత్రి చెప్పారు. వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

యాప్‌లకు AI ఏజెంట్లు

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు ( AI) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏఐ ఏడాదిలోనే సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లన్నింటినీ రాసేస్తుందని ఇప్పటికే పలువురు టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషులు అందిస్తున్న కొన్ని సేవలను ‘ AI ఏజెంట్లు’గా పిలిచే యంత్రాలే చేయనున్నాయి. ఇక యాప్‌లను ఏఐ ఏజెంట్లు అభివృద్ధి చేయనున్నట్టు తాజాగా ‘గ్లోబల్‌ సీఆర్‌ఎం లీడర్‌ సేల్స్‌ ఫోర్స్‌’ తెలిపింది. ఏఐతో ఉద్యోగ నియామకాల్లో సైతం భారీ మార్పులు వస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్న నేపథ్యంలో […]

మహిళా రైతుల కోసం ఈ-ట్రాక్టర్‌.. మార్కెట్లోకి వచ్చేసింది..

సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నిజంగా ఒక గేమ్-ఛేంజర్. దీనికి ‘సీఎస్‌ఐఆర్ ప్రైమా ఈటీ 11-కుశాల్’ అని పేరు పెట్టారు. ముఖ్యంగా మహిళా రైతులు సులభంగా నడిపేలా దీనిని రూపొందించడం ఈ ఆవిష్కరణలోని మరో విశేషం, వారికి ట్రాక్టర్ నడపడంలో ఉండే ఇబ్బందులను గుర్తించి.. చీరకట్టులో కూడా సులభంగా ఎక్కేలా ట్రాక్టర్ ఎత్తును సర్దుబాటు చేయడం, సీటింగ్ సౌకర్యాన్ని మార్చడం, లివర్లు, స్విచ్‌లను […]

డీప్‌టెక్ వద్దు… స్టార్టప్‌ ముద్దు..

ఇండియాలో డీప్‌టెక్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సంజయ్‌ పేర్కొన్నాడు. దీనివల్ల దేశంలో స్టార్టప్‌ల సంఖ్య తగ్గుతుందని, ఆ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయన్నారు. అంతేకాకుండా… ఇప్పటికే ఏఐ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించి అభివృద్ది చేస్తున్నవారిపై డీప్‌టెక్‌ ప్రభావం ఉంటుందని నూతన స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోతారని ఆయన హెచ్చరించారు.

AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI సినిమా కన్నడలో వచ్చింది. ఈ ‘లవ్ యూ’ అనే సినిమాను కేవలం 10 లక్షలతో AI ద్వారా రూపొందించడం విశేషం. దర్శక నిర్మాత నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ AIతోనే చేశారు. 95 నిమిషాల సినిమా:  “95 నిమిషాల నిడివి గల సినిమాలో 12 పాటలున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యులు […]

ఒత్తిడితో ఐదుగురు AI శాస్త్రవేత్తల మరణం..

AI రంగంలో చైనా, అమెరికా మధ్య సాంకేతిక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఈ సంవత్సరం,ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఐదుగురు అగ్రశ్రేణి AI శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధన వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON