loader

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్..

అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఓయూలను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను […]

సరికొత్త డిజైన్‌తో ఆండ్రాయిడ్ 16..

గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 16 బీటాను విడుదల చేయడం ప్రారంభించింది. దీనిలో పూర్తిగా కొత్త, స్మార్ట్ ఇంటర్‌ఫేస్ మెటీరియల్ ఎక్స్‌ప్రెసివ్ UI కనిపిస్తుంది. ఇందులో అతి ముఖ్యమైన మార్పులు ఉన్నాయి, మీ క్యాబ్ స్థితి, ఫుడ్ డెలివరీ అప్‌డేట్ మొదలైన ప్రత్యక్ష కార్యకలాపాలు లాక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. కర్వీ ఐకాన్‌లు, కొత్త టైప్‌ఫేస్ స్క్రీన్‌కు కొత్త రూపాన్ని ఇస్తాయి.  జూన్ 2025 నాటికి ఈ QPR1 బీటాను పూర్తిగా స్థిరంగా మార్చాలని […]

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వాయిస్ చాట్

WhatsApp తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక గ్రూప్ చాట్‌లలో టైపింగ్ శ్రమ అక్కర్లేదు. గ్రూప్ వాయిస్ చాట్ అనే కొత్త టూల్‌ను ప్రారంభించింది, మీరు గ్రూప్ చాట్‌లో నేరుగా మీ గొంతుతో మాట్లాడవచ్చు, అది కూడా హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్‌లో. అంటే కాల్ చేయకుండా, నేరుగా గ్రూప్‌లో లైవ్ వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు, అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

ఒక్క ఫన్నీ మీమ్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ..

మీకు తెలియని నంబర్ లేదా కాంటాక్టుల్లో ఉన్న స్నేహితుల నుంచి ‘ఒక ఫన్నీ మీమ్, “రూ. 5000 గెలుచుకోండి” వంటి ఆఫర్, లేదా క్లిక్‌బైట్ వస్తుంది. మీరు ఆ ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేయగానే, మాల్‌వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్‌లో సైలెంట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ స్పైవేర్ మీ ఫోన్ వర్చువల్ కీబోర్డ్‌లో మీరు టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేయగలదు. అంటే, మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, పిన్‌లు, సోషల్ మీడియా లాగిన్ వివరాలు అన్నీ […]

ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది!

ఈ-పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్‌ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) టెక్నాలజీ తో ఈ-పాస్‌పోర్ట్‌ అనుసంధానమై ఉంటుంది. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్‌ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఈ-పాప్‌పోర్ట్‌ ద్వారా అథెంటికేషన్‌ సులభతరం అవుతుంది.

ఈ నంబర్లపై యూపీఐ లావాదేవీలు నిలిపివేత!

భారత ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. ఇప్పటి నుండి అనేక మొబైల్ నంబర్లకు UPI చెల్లింపులు చేయలేరు. దేశంలోని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆర్థిక మోస ప్రమాద సూచిక సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది అధిక-రిస్క్ మొబైల్ నంబర్‌లపై యూపీఐ లావాదేవీలను బ్లాక్ చేస్తుంది. దేశంలో ఆర్థిక నేరాలను గుర్తించి నిరోధించడానికి ఈ కొత్త సాధనాన్ని రూపొందించామని , ఈ ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థ ప్రాథమికంగా ఏదైనా సైబర్ నేరంలో పాల్గొన్న  మొబైల్ నంబర్‌లను గుర్తిస్తుందని టెలికాం […]

భారత్‌లో త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రావడం రావడంతోనే ఇండస్ట్రీని షేక్ చేయాలన్న సంకల్పంతో వస్తున్నారు. సుమారు రూ. 840 కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా ప్లాన్‌లతో దండయాత్రకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  భారతదేశం తన బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక విధ్వంసకరమైన ఆరంభాన్ని ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.

మొరాయించిన ఎక్స్.. నిలిచిపోయిన ట్వీట్స్

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, దీనివల్ల వినియోగదారులు యాప్, వెబ్‌సైట్‌లో పేజీలు లోడ్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, పెరూ, మలేషియా, , జర్మనీ సహా పలు దేశాలలో ఈ సమస్య ఉత్పన్నమయింది.

33 మంది అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు అరెస్టు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో నడుస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసం ముఠాను జిల్లా పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా ఛేదించారు. ఈ ముఠా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతోంది. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను నియమించి, స్క్రిప్ట్‌లు, మోసపు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 33 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

అమెరికా గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’ ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON