loader

ఇస్రోనా మజాకా.. స్పేస్‌ఎక్స్ తప్పిదం గుర్తింపు..

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 ప్రయోగానికి ముందు, 13 మంది సభ్యులతో కూడిన ఇస్రో బృందం కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించింది. దర్యాప్తు లో, రాకెట్ మొదటి దశలో ఆక్సిడైజర్ లైన్‌లో ఒక పగులు కనుగొన్నారు. స్పేస్‌ఎక్స్ మొదట దీనిని ఒక చిన్న లీకేజీగా భావించి ప్రక్షాళన సాంకేతికతతో సరిపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ దానిని పూర్తిగా తిరస్కరించారు. చివరికి స్పేస్‌ఎక్స్ ఇస్రో షరతులకు అంగీకరించి, పగిలిన భాగాన్ని భర్తీ […]

మీ ఫోన్‌లో ఆ యాప్స్ ఉంటే మీ సొమ్ము హాంఫట్..

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకరమైన యాప్‌ ద్వారా మినోమిక్ ఫేజ్ కోడ్ ద్వారా ఎవరైనా మీ క్రిప్టో మొత్తాన్ని దొంగిలించవచ్చు. ఈ క్రిప్టో కరెన్సీ నకిలీ యాప్స్ ఇప్పటికే 20 కి పైగా కనుగొన్నారు. ముఖ్యంగా పాన్‌కేక్ స్వాప్, సూయట్ వాలెట్, హైపర్‌లిక్విడ్, రేడియం, బుల్‌ఎక్స్ క్రిప్టో, ఓపెన్ ఓషన్ ఎక్స్ఛేంజ్, మెటియోరా ఎక్స్ఛేంజ్, సుషీస్వాప్ మరియు హార్వెస్ట్ ఫైనాన్స్ బ్లాగ్ వంటి పేర్లతో ఉండే యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ బాట పడుతున్న గూగుల్.. సెర్చ్ ఇంజిన్‌లోనూ ఏఐ సాయం

గూగుల్ తన ఏఐ మోడ్ ఫర్ సెర్చ్‌లో ‘సెర్చ్ లైవ్’ అనే కొత్త వాయిస్-పవర్డ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెర్చ్ లైవ్ ద్వారా వినియోగదారులు తమ ప్రశ్నలను వాయిస్ ద్వారా గూగుల్‌కు అందించవచ్చు. సెర్చ్‌ను టైప్ చేసి లింక్‌ల ద్వారా శోధించడానికి బదులుగా వినియోగదారులు వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే వాటి సమిష్టిగా సమాధానాలను వారికి తిరిగి చదివి చెబుతుంది.

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తో స్పేస్‌లోకి 8 కాళ్ల జీవి

గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. శుక్లా భూమిపై నుంచి చాలా విచిత్రమైన సూక్ష్మజీవిని కూడా తీసుకువెళ్లనున్నారు. అదే టార్డిగ్రేడ్స్. టార్డిగ్రేడ్స్‌ను నీటి ఎలుగుబంట్లు లేదా నాచు పందిపిల్లలు అని కూడా పిలుస్తారు… ఈ సూక్ష్మ జీవులు అంతరిక్షంలోని కఠినమైన వాతావరణంలో ఎలా మనుగడ సాగిస్తాయో, ఎలా పునరుత్పత్తి చేస్తాయో?, వాటిని అవి ఎలా బాగు చేసుకుంటాయో అన్వేషించనున్నారు.

పూర్తిగా డౌన్ అయిన ఓపెన్ ఎఐ చాట్‌జిపిటి.!

ఓపెన్ ఎఐ చాట్ బాట్ చాట్‌జిపిటి పూర్తిగా డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని డౌన్ డిక్టేటర్ సాక్షిగా యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ క్రౌడ్ సోర్స్ అవుట్టేజ్ మోనిటర్ సర్వీస్ downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చాట్‌జిపిటి డౌన్ అయినట్లు గుర్తించిన యూజర్లు ఈ సైట్ నుంచి రిపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి మొదలైన సమస్య మధ్యాహ్నం 2 గంటల తర్వాత తార స్థాయికి చేరుకున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.

AXIOM-4 మిషన్ ప్రయోగం జూన్ 11కి వాయిదా

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు సరిగా లేవని జూన్‌10 జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా జూన్ 11న నిర్వహించబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది.

భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: జితేంద్రసింగ్

మంగళవారం జరిగే స్పేస్‌ ఎక్స్ (Space X) ప్రయోగంలో మరో ముగ్గురితో కలిసి భారత్‌కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి పయనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇస్రో-నాసా మిషన్ వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు.

Google Photos లో కొత్త AI వీడియో ఎడిటింగ్ టూల్స్

గూగుల్ ఫొటోస్ లో గూగుల్ కొత్తగా AI-Powered ఎడిటింగ్ టూల్స్ జత చేసింది.  కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం జత చేసింది. రీ ఇమాజిన్, ఆటో ఫ్రేమ్ మరియు AI ఎన్ హెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు గూగుల్ ఫొటోస్ లో కొత్తగా Ultra HDR ఫీచర్ ను కూడా జత చేసింది. ఈ ఫీచర్ పాత ఫోటోలను మంచి బ్రైట్నెస్ మరియు కలర్ రేంజ్ తో గొప్ప అప్ స్కేల్ […]

కొన్ని ఉద్యోగాలు AI రీప్లేస్ చేయలేదు- గూగుల్ డీప్ మైండ్ CEO

AI ఎంత అభివృద్ధి చెందినా కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి పట్టు సాధించలేదని నోబెల్ గ్రహీత మరియు గూగుల్ డీప్ మైండ్ CEO అయిన డెమిస్ హస్సాబిస్ తెలిపారు. మేథమెటికల్ మరియు సైంటిఫిక్ ఫండమెంటల్స్ ను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. AI మరింత అభివృద్ధి చెందినా కూడా సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం కష్టతరం కావచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇక ఈ ఫోన్‌లలో యూట్యూబ్‌ పని చేయదు..

YouTube తన iOS యాప్ కొత్త అప్‌డేట్ (వెర్షన్ 20.22.1)ను విడుదల చేసింది. ఈ యాప్ అనేక పాత iPhone, iPad మోడళ్లలో పనిచేయడం ఆగిపోతుంది. YouTube యాప్‌ను పని చేయడానికి కనీసం iOS లేదా iPadOS 16.0 అవసరం అవుతుంది. ఈ అప్‌డేట్ iPhone 7, iPhone 6, iPhone SE (1 జనరేషన్‌), iPad mini 4, iPad Air 2 వంటి పాత డివైజ్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON