loader

విశాఖలో షఫాలీ సునామీ.. రెండో టీ20లోనూ చిత్తైన శ్రీలంక..!

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలకమైన షఫాలీ వర్మ(69 నాటౌట్) టీ20 సిరీస్‌లోనూ దంచేసింది. వైజాగ్ మైదానంలో మంగళవారం శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తూ హాఫ్‌ సెంచరీతో చెలరేగింది. తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించిన లేడీ సెహ్వాగ్ జట్టుకు భారీ విజయాన్ని అందించింది. స్వల్ప ఛేదనలో షఫాలీ మెరుపులతో ఏడు వికెట్ల తేడాతో లంకను టీమిండియా మట్టికరిపించింది. వరుసగా రెండో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశే.. చిన్న‌స్వామి స్టేడియంలో నో క్రికెట్

విజ‌య్ హ‌జారే ట్రోఫీక్రికెట్ మ్యాచ్‌ల‌ను బెంగుళూరులోని ఎం చిన్న‌స్వామి స్టేడియంలో నిర్వ‌హించాల్సి ఉంది. కానీ రేప‌టి నుంచి జ‌ర‌గాల్సిన మ్యాచ్ వేదికను అక‌స్మాత్తుగా మార్చేశారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా, క‌ర్నాట‌క ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం చిన్న‌స్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఢిల్లీ, ఆంధ్ర మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. వాస్త‌వానికి ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరాట్ కోహ్లీ సిద్దంగా ఉన్నారు. కానీ ఆయ‌న అభిమానుల‌కు నిరాశే మిగ‌ల‌నున్న‌ది.

స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల టీ20 ఇంటర్నేషనల్స్‌లో  4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండవ క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. ఇప్పటివరకు న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (177 మ్యాచ్‌లలో 4,716 పరుగులు) మాత్రమే సుజీ బేట్స్ 4000 పరుగుల కోసం 3675 బంతులు తీసుకోగా, మంధాన కేవలం 3227 బంతుల్లోనే (448 బంతులు తక్కువగా) ఈ ఘనతను సాధించి ప్రపంచ […]

విశాఖలో దంచేసిన జెమీమా.. శ్రీలంకపై భారీ విజయంతో టీమిండియా బోణీ..!

వన్డే ఛాంపియన్ భారత జట్టు తొలి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.  విశాఖపట్టణంలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా  శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగించిన జెమ్మీ..  స్మృతి మంధాన(25)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసింది.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌(15 నాటౌట్)తో కలిసి కూల్‌గా ఆడిన జెమ్మీ.. టీమిండియాను 8 వికెట్లతో గెలిపించింది.భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో లంక 6 వికెట్ల నష్టానికి 121కే పరిమితమైంది.

టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టుపై గంభీర్ స్పందన ఇదే

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ పేరును చేర్చలేదు. టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి శుభ్‌మ‌న్ గిల్ ను తొలగించడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మౌనంగా ఉన్నాడు. 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన వెంటనే, గంభీర్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు మరియు విలేకరులు ఈ నిర్ణయంపై అతని అభిప్రాయం అడిగారు. అయితే, మాజీ ఓపెనర్ […]

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు

టీమ్ఇండియా వరల్డ్​కప్ జట్టు – అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి

టీ20 ప్రపంచప్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ..! ఐసీసీ ఈవెంట్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌..!

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా టోర్నీలో జట్టును నడిపించనున్నాడు. ఈ జట్టుకు ఆల్​రౌండర్ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే వైస్​కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్​కు సెలక్టర్లు షాకిచ్చారు. అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అటు యశస్వీ జైస్వాల్​కు కూడా నిరాశే మిగిలింది. ఈసారి ఇషాన్ కిషన్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్​ను ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ఒకేమ్యాచ్‌లో సంజూ డబుల్ ధమాకా.. టీ20ల్లో రికార్డుల మోత..!

టీ20 క్రికెట్‌లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్ రికార్డుల మోత మోగించాడు. అహ్మదాబాద్‌ టీ20లో ఓపెనర్‌గా ఉన్నంత సేపు దంచేసిన సంజూ.. అంతర్జాతీయంగా వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 రన్స్ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడీ లెఫ్ట్ హ్యాండర్. 679 బంతుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్న సంజూ మాజీ సారథి హార్దిక్ పాండ్యా రికార్డు సమం చేశాడు.

భారత్‌కు మళ్లీ వస్తా.. మీకోసం ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఆడుతా..!

భారత్‌లో పర్యటిస్తున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, అతడి బృందం అభిమానుల ప్రేమకు పులకించిపోతున్నారు. మూడో రోజు ఢిల్లీలో అపూర్వ స్వాగతం అనంతరం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్‌ను అలరించాడు మెస్సీ. టీ20 ప్రపంచకప్ టికెట్ విడుదల చేసిన తర్వాత..భారీగా తరలివచ్చిన అభిమానలను ఉద్దేశించి ఫుట్‌బాల్ ఐకాన్ మాట్లాడాడు. తాము మరోసారి భారత్‌కు వస్తామని, అప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ ఆడుతామని మాటిచ్చాడీ సాకర్ లెజెండ్.  మరోసారి చెబుతున్ను.. మేము తప్పనిసరిగా భారత్‌కు మళ్లీ వస్తాం. అందరికీ కృతజ్ఞతలు’ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON