సోషల్ మీడియాలో సైలెన్స్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి.. న్యూ ఇయర్ పోస్ట్ వైరల్
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా కోహ్లి షేర్ చేసిన తాజా పోస్టు అభిమానుల హృదయాలను తాకింది. “నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను” అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్‌గా మారి, పది మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

