loader

కౌర్, మంధాన పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో విజయంతో సెమీస్‌కు ఇంగ్లండ్

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ(650)లు అర్ధ శతకాలతో మెరిసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగు విజయాలతో నాట్ సీవర్ బ్రంట్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది.

చెన్నై ఓపెన్‌లో యువకెరటాలు.. రాజేశ్వరన్, యమలపల్లికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ

జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న యువ క్రీడాకారిణులకు మాయా రాజేశ్వరన్, సహజ యమలపల్లి కి మరో మెగా టోర్నీ అవకాశం దక్కింది. స్వదేశంలో జరుగబోయే చెన్నై ఓపెన్‌లో ఇద్దరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. డబ్ల్యూటీఏ 250 టోర్నీ చెన్నై ఓపెన్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకూ జరుగనుంది. స్పెయిన్‌లోని రఫెన్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయా రాజేశ్వరన్ జూనియర్ లెవల్లో చెలరేగిపోతోంది. సహజ యమలపల్లి కూడా ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది.

భారత క్రికెట్ సంఘం అధ్యక్షురాలిగా మాజీ కెప్టెన్..

భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కీలక పదవికి ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా రంగస్వామి ఎన్నికయ్యారు. ఢిల్లీ మాజీ ఓపెనర్ వెంకట్ సుందరం కార్యదర్శిగా .. దీపక్ జైన్ కోశాధికారిగా,జ్యోతి థాటే, సంతోష్ సుబ్రమణియన్‌లు ఐసీఏ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన రంగస్వామి భారత క్రికెట్‌లో దిగ్గజ ప్లేయర్. మహిళల జట్టుకు తొలి కెప్టెన్‌గా పేరొందిన ఆమె.. 1976 నుంచి 1991 మధ్య కాలంలో ఇండియాకు ప్రాతినిధ్యం […]

RCB ఫ్రాంచైజీ కోసం రంగంలోకి అదానీ గ్రూప్- రేస్లో మరో 4 కంపెనీలు కూడా!

2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ అయిన “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు” (ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొనుగోలుకు బడా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో అదానీ, జిందాల్, పూనావాలాలు సహా రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు విషయంలో అదర్ పూనావాలా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

టెస్ట్ క్రికెట్+టీ20 ఫార్మాట్‌ల కలయికతో టెస్ట్ ట్వంటీ లాంచ్..

క్రికెట్‌లో టెస్ట్ ట్వంటీ. ఈ ఫార్మాట్‌లో టెస్ట్ క్రికెట్ లోతైన వ్యూహాలను, టీ20 క్రికెట్ వేగం, ఉత్సాహంతో మిళితం చేయనున్నారు.20-20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. అంటే, టెస్ట్ మ్యాచ్‌లో మాదిరిగానే ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది ఫలితాలు కూడా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లాగే ఉంటాయి. అంటే, గెలుపు, ఓటమి, టై లేదా డ్రా వంటి నాలుగు రకాల ఫలితాలు ఇందులో సాధ్యమవుతాయి.

2026 టీ20 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన 20 జట్ల లిస్ట్

2026లో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ కోసం క్వాలిఫైయింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 20 జట్లతో కూడిన తుది జాబితా ఖరారైంది. ఒమన్‌లో జరిగిన ఆసియా – ఈఏపీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన చివరి 20వ జట్టుగా నిలిచింది. ఈ క్వాలిఫైయింగ్ ద్వారా నేపాల్, ఒమన్‌తో పాటు యూఏఈ కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది

మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఏకంగా రాచకొండ సీపీకి ఫిర్యాదు!

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ను వరుస వివాదాలు వెంటాడున్నాయి. కొత్తగా HCAతో పాటు పలువురు ప్లేయర్సపై అనంత్‌ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం నడిచిందని కంప్లైంట్‌ ఇచ్చారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. HCA నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని అనంత్‌రెడ్డి […]

విండీస్‌పై రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం..

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. నేడు రెండో టెస్టులో ఘన విజయం సాధించడంతో సిరీస్ భారత్‌ సొంతమైంది. రెండో టెస్టులో ఆఖరి రోజున ఆటను 63/1 స్కోరుతో ప్రారంభించిన భారత్ ఆ తరువాత మరో రెండు వికెట్ల నష్టానికి 121 లక్ష్యాన్ని పూర్తి చేసి సునాయాస విజయం అందుకుంది. కేఎల్ రాహుల్ 58 పరుగులు సాధించి అర్ధశతకంతో మెరిశాడు. బౌలింగ్‌లోనూ భారత్ సత్తా చాటడంతో విండీస్ 248 పరుగులకే కుప్ప కూలి ఫాలో […]

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన

మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2025లో) 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. విశాఖపట్నం లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. స్మృతిమంధాన 54 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఈ మైలురాయిని చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం, మంధాన ఈ సంవత్సరంలో కేవలం 18 […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON