loader

శ్రేయస్ కోలుకుంటున్నాడు.. మెస్సేజ్ లకు రిప్లే ఇస్తున్నాడు: సూర్య

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోరుకుంటున్నాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అయ్యర్ అందరితో మాట్లాడుతున్నాడని.. మెసేజ్ లకు కూడా రిప్లే ఇస్తున్నాడని సూర్య చెప్పాడు. ఐసియు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.

హిట్‌మ్యాన్ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన సిడ్నీకి వీడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘చివరిసారిగా సిడ్నీ నగరానికి వీడ్కోలు పలుకుతున్నాను’ అంటూ క్యాప్షన్‌తో గుడ్ బై చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్.. సిడ్నీ కింగ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

శ్రీయకు రజతం

మనామా (బహ్రెయిన్‌): ఆసియా యూత్‌ గేమ్స్‌లో భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) యువ ఫైటర్‌ శ్రీయ మిలింద్‌ రజతం గెలుచుకుంది. గర్ల్స్‌ 50 కిలోల ఫైనల్‌లో ఆమె.. కజకిస్థాన్‌ అమ్మాయి అమెలినా బకియెవ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో శ్రీయ.. ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారత మహిళా ఎంఎంఏ ఫైటర్‌గా రికార్డులకెక్కింది. ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటికే 2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాల (మొత్తం 16 […]

హిట్‌మ్యాన్ శతకం.. కోహ్లీ అర్ధ శతకం..

విరాట్ కోహ్లీ మూడో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ సెంచరీతో (121 పరుగులు) అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని 33వ వన్డే సెంచరీ కాగా, ఓవరాల్ 50వ అంతర్జాతీయ సెంచరీ.  కోహ్లీ, రోహిత్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని 19వ సారి నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, కుమార్ సంగక్కర- తిలకరత్నే దిల్షాన్ మాత్రమే ఇప్పుడు అత్యధిక […]

అదరగొట్టిన రోకో.. సిడ్నీలో భారత్ ఘన విజయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం (అక్టోబర్ 25) జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్‌ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.

ఆస్ట్రేలియా 236 ఆలౌట్‌.. 4 వికెట్లు తీసిన హ‌ర్షిత్ రాణా

భార‌త్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవ‌ర్ల‌లో 236 ర‌న్స్ చేసి ఆలౌటైంది. బౌలింగ్‌కు అనుకూలించిన సిడ్నీ పిచ్‌పై భార‌త బౌల‌ర్లు ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేశారు. ఇంకా 3.2 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త స్పీడ్ బౌల‌ర్ హ‌ర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో రెన్షా ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీ స్కోర్ చేశాడు. […]

పదేళ్ల రేసర్‌ భవితకు భరోసా.. ఫార్ములా వన్ అకాడమీ..!

కారు రేసింగ్‌లో అదరగొడుతున్న జమ్ము కశ్మీర్ బాలిక.. యువ రేసర్‌ అతీకా మిర్‌ కష్టాలు తొలగిపోన్నాయి. ట్రాక్ మీద అద్బుతాలు చేస్తున్న ఆమె గురించి తెలిసిన ఫార్ములా వన్ అకాడమీ సంస్థ ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిందీ సంస్థ. తద్వారా సాంకేతికంగా, ఆర్ధికంగా ఫార్ములా వన్ సహకారం అందుకున్న మొదటి భారత రేసర్‌గా అతీకా గుర్తింపు సాధించనుంది.

మంధాన సూపర్ క్యాచ్.. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్‌

భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. రికార్డు ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెడుతూ వికెట్లు తీస్తున్నారు. టాపార్డర్ కుప్పకూలిన వేళ.. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అమేలియా కేర్( 45) సైతం ఔటయ్యింది. సాధించాల్సిన రన్‌రేటు 9కి చేరడంతో పెద్ద షాట్లు ఆడబోయిన అమేలియా.. స్నేహ్ రానా ఓవర్లో మిడాన్‌లో బౌండరీకి యత్నించింది. అక్కడే ఉన్న స్మృతి మంధాన జంప్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. అంతే.. జట్టు స్కోర్ 100 దాటించిన జోడీని విడదీసింది రానా.

శతక్కొట్టిన ప్రతీక, మంధాన, జెమీమా రోడ్రిగ్స్…

చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. జెమీమా రోడ్రిగ్స్(76 నాటౌట్) విధ్వంసక హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారిద్దరూ. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 49వ ఓవర్లకు కుదించగా.. జెమీమా, రీచా ఘోష్‌(4 నాటౌట్) చెరొక బౌండరీ కొట్టడంతో.. టీమిండియా ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లెఫ్టినంట్ క‌ల్న‌ల్‌గా నీర‌జ్ చోప్రా

భార‌త మేటి జావెలిన్ త్రోయ‌ర్‌, ఒలింపిక్ ప‌త‌క విజేత నీర‌జ్ చోప్రాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. జావెలిన్ సూప‌ర్ స్టార్ నీర‌జ్ చోప్రాకు భార‌తీయ ఆర్మీలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ర్యాంక్‌ను అంద‌జేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆయ‌న్ను ఆ ర్యాంక్‌తో స‌న్మానించారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నీర‌జ్ చోప్రా కుటుంబం కూడా ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON