loader

రేవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ నేత క‌న్న‌య్య కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జి క‌న్న‌య్య కుమార్ విరుచుకుప‌డ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని రేవంత్ రెడ్డిని నిల‌దీశారు. దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు అని, రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా.. నేను భయపడను అని కాంగ్రెస్ […]

కరూర్ ఓకే.. మణిపూర్ సంగతేంటి..బీజేపీపై స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. మణిపూర్‌లో గత రెండేళ్లుగా అల్లర్లు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్కడ బీజేపీ ఎంపీలు ఎందుకు సందర్శనకు వెళ్లలేదని ఆయన సూటిగా అడిగారు. మణిపూర్‌లో 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, అయినప్పటికీ కేంద్రం నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆయుధ పూజనా?.. వెపన్స్ దుకాణమా..?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యాదసరా ఆయుధ పూజ సందర్భంగా.. దాదాపు 200కు పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు. ఇప్పుడిదే వీడియో యూపీలో వైరల్ అయింది. ఇలా బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది.<span;>200కు పైగా ఆయుధాలుండటంపై పోలీసులు నజర్ పెట్టారు. ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. వీటన్నింటికి పర్మిట్ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నారు.

మహిళలను వివస్త్రలను చేసిన కొట్టిన NSUI అధ్యక్షుడు.. జూబ్లీహిల్స్‌

మంత్రి వివేక్‌ వెంకటస్వామి రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని బ్రహ్మశంకర్‌ నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తోపాటు ముగ్గురు మహిళలపై వెంకటస్వామి తన అనుచరులతో కలిసి దాడిచేశాడు. స్థానిక కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి వర్గంపై కోపంతో.. ఆయన మనుషులు తనకు అడ్డుగా ఉన్నారని వారిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వెంకటస్వామి ఇండ్లలోకి దూసుకెళ్లి, మహిళలని కూడా చూడకుండా వివస్త్రలను చేసి కొట్టాడని స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు.

సంఘ్ బలం మాటల్లో కాదు.. చేతలలో ఉంది: ఆర్‌ఎస్‌ఎస్‌కు పవన్ కల్యాణ్ విషెస్..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జాతీయత మొదలైన అంశాలలో అద్భుతమైన నిబద్ధతను చూపిన ఆర్‌ఎస్ఎస్ పవిత్రమైన విజయదశమి రోజున వంద అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు.ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. సూర్యాపేట నుంచి ఒక పర్యాయం ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు

సోషల్ మీడియాపై యుద్ధం.. చంద్రబాబు సర్కార్ సరికొత్త వ్యూహం..

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం.. మంత్రులు లోకేష్, సత్యకుమార్, హోమ్, పార్థసారథి, నాదెండ్ల మనోహర్ లు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ […]

హిందూ ధర్మానికి నేను వ్యతిరేకం కాదు.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల

దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించి, తన వాదనను వివరించారు. హిందూ ధర్మానికి, మతానికి తాను కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా […]

ఆస్పత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే… కారణమిదే!

కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున్ ఖర్గే ఆసుపత్రిలో చేరారు. జ్వరం, కాళ్ల నొప్పితో బాధపడుతుండటంతో ఆయనను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యులు మల్లికార్జున ఖర్గేకు చికిత్స అందిస్తున్నారు. ‘‘మల్లికార్జున ఖర్గేకు జ్వరం వచ్చి కాళ్ల నొప్పి ఉందని ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన క్షేమంగా ఉన్నారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు’’ అని కాంగ్రెస్ నాయకులు ఒకరు […]

నాపై ప్రతీకారం తీర్చుకోండి.. కానీ నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దు.. విజయ్

తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాటపై టీవీకే పార్టీ అధినేత విజయ్‌ తొలిసారిగా స్పందించడంతోపాటు.. వీడియో విడుదల చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. ఎంతో ప్రేమతో తన మీటింగ్‌కు ప్రజలు వచ్చారని.. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని విజయ్ పేర్కొన్నారు. తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని విజయ్ పేర్కొన్నారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు.. నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లకండి.. అంటూ విజయ్‌ కోరారు. సీఎం స్టాలిన్‌ నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ సంచలన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON