loader

దున్నపోతు అంటావా?.. పొన్నం.. క్షమాపణ చెప్పాల్సిందే!

జూబ్లీహిల్స్‌లో జరిగిన మీటింగ్‌లో పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. అడ్లూరి సమయానికి రాలేదని “దున్నపోతు” అంటూ అవమానించిన పొన్నం వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారాయి. “మాదిగ జాతిలో పుట్టానని నన్ను అవమానిస్తారా?” అంటూ అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి వరకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్‌ హాసన్‌పై అన్నామలై ఫైర్‌

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్‌, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్‌ తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై మండిపడ్డారు. ఒక రాజ్యసభ సీటు కోసం కమల్‌ చాలా కాలంగా తన అంతరాత్మను అమ్ముకున్నారు. కరూర్‌ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా..? ఆయన మరీ ఇంత దిగజారాలా..? అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ […]

ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కేటాయింపు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది సీఎం అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆయనకు కేంద్రం అధికారిక బంగ్లాను కేటాయించింది. 95, లోధి ఎస్టేట్‌లోని టైప్‌ 7 బంగ్లాను కేటాయించింది. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన లోధి ఎస్టేట్‌ లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించాలని ఆప్‌ కోరింది. మంత్రి పంకజ్‌ చౌదరికి కేటాయించడంతో.. కేజ్రీకి వేరే బంగ్లా […]

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అక్టోబర్ 9న అభ్యర్థులను ప్రకటిస్తాం..!

మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమధ్యే రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఓట్ల కదన రంగంలో దూకుతున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుంది. అక్టోబర్ 9న పేర్లు వెల్లడిస్తాం. లిస్ట్ వచ్చాక మీరు ఆశ్చర్యపోతారు. నా పేరు కూడా ఆ జాబితాలో ఉంటుంది

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమైన పవన్ కల్యాణ్‌..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పవన్‌ కల్యాణ్‌ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.  ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో […]

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

బిహార్‌ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ […]

రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే

బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. రెండుదశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతకు అక్టోబర్ పదో తేదీన, రెండో విడతకు పదమూడో తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ పధ్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. బీహార్‌లో 243 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లో  ఈ ఎన్నికల్లో 7.42 కోట్ల మంది ఓటర్లు  ఓటు […]

వాటికి ఆధార్‌ సాక్ష్యం కాదు.. అప్పటికల్లా బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్‌ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని జేడీయూ కోరింది. నవంబర్‌ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. తొలిసారి ఈవీఎం బ్యాలెట్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్‌ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని స్పష్టం చేశారు.

జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు […]

కారు కూతలు కూస్తే చెప్పుతో కొడతా… తోపుదుర్తికి, పరిటాల సునీత వార్నింగ్

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలని కూడా చూడకుండా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON