loader

పేర్ని నాని, కిట్టుకి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్

బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. వీరి వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జైపాల్ ఖండించారు. పోలీస్ శాఖను బెదిరిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా పేర్ని నాని, కిట్టు వ్యాఖ్యలతోపాటు చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు.

ప్రజా సమస్యల గురించి మాట్లాడే వ్యక్తికి ‘ఆప్’ ప్రమోషన్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ నుంచి తొలగింపు

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చడ్డాను తొలగించే నిర్ణయం తీసుకుంది. ఇది పార్టీలో అంతర్గత విభేదాల సంకేతాలను చూపిస్తోంది. ఆప్ ఎంపీ అశోక్ మిత్తల్‌ను రాజ్యసభలో పార్టీ కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారిక లేఖ రాసి, చడ్డాను పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినట్లు తెలిపింది. అలాగే రాఘవ్ చడ్డాకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సమయం కేటాయించవద్దని కోరింది.

బెంగాలీలను వేధిస్తున్నారు.. బిజెపిపై విరుచుకుపడిన మమత

ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు.

పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్‌లో జరిగిన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో మంగళవారం కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కౌశిక్ రెడ్డి కలిగించారని.. అంతేకాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఐసిఎస్ ల సంఘం కూడా కౌశిక్ రెడ్డిపై […]

LDF గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు : రాహుల్‌ గాంధీ

భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, బీజేపీకి లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (LDF)కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF పోరాడుతోందని వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో LDF గెలవాలని […]

ముఖ్యమంత్రి కారులో ఫ్లయింగ్ స్క్వాడ్‌ తనిఖీలు!

తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. వివిధ రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న నేతలపై ఎన్నికల అధికారుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సీఎం స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే ఇరు పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయని […]

విజయ్ కు 404 కోట్ల ఆస్తులు.. ఖరీదైన కార్లతో పాటు TVS XL సూపర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తం రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మారుతీ సుజుకీ స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్టెల్ సూపర్ కూడా ఉన్నట్లు విజయ్ పేర్కొనడం గమనార్హం భార్య సంగీత పేరు మీద రూ.15 కోట్ల విలువైన […]

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : నామినేషన్ దాఖలు చేసిన విజయ్​

తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన విజయ్, తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్ , తిరుచి ఈస్ట్ అనే రెండు అర్బన్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.విజయ్ వ్యాసర్‌పడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్‌ను దాఖలు చేశారు. విజయ్‌ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ సహా పలువురు సీనియర్ పార్టీ […]

అవినీతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ తీర్మానం

అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్న అవినీతిని చట్టబద్ధత చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అమరావతికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడమే కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారు. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోందిఅని అన్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON