loader

బీహార్‌ ఎన్నికల్లో ఓటమి..మౌనదీక్ష చేపట్టిన ప్రశాంత్‌ కిషోర్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోరంగా ఓడిపోయింది. ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు. బీహార్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమం లో ఈ రోజు మొత్తం మౌన దీక్షలో ఉండనున్నారు. మరోవైపు నేడు బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం […]

అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన ఈ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో దాదాపు అరగంటపాటు గడిపారు. 11.40గంటలకు కోర్టుకు వచ్చిన జగన్ 12.15గంటలకు బయటకు వెళ్లిపోయారు.

10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్‌ కుమార్‌

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్ మొహమ్మద్‌ ఖాన్‌.. నితీశ్‌ కుమార్‌ చేత ప్రమాణం చేయించారు. బీహార్‌ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసిన నేతగా రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హ ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

సీఎం మార్పు వార్తల నేపథ్యంలో డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు..!

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కర్నాటక కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చునన్నారు. పదవిలో శాశ్వతంగా తాను ఉండలేనని.. ఐదున్నర సంవత్సరాలు అయ్యిందని.. మార్చినాటికి ఆరు సంవత్సరాలు అవుతుందన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నారు. తాను ఆయన నాయకత్వంలోనే ముందు వరుసలో ఉంటానని.. ఎవరూ చింతించొద్దన్నారు.

జేడీయూ శాసనసభాపక్షనేతగా నీతీశ్​- బీజేపీ ఫ్లోర్ లీడర్​గా సామ్రాట్ చౌదరీ

జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ను బిహార్‌ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్లు మంత్రి శ్రవణ్​ తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షనేతగా మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ఎన్నికయ్యారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఉపశాసనసభాపక్షనేతగా ఎంపికయ్యారు. వీరిని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు ఉత్తర్​ప్రదేశ్​ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.

నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు

బిహార్ లో మరోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పాట్నా వేదికగా ఈ నెల 20న జరగనున్న ఈ అట్టహాస కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) మరియు మంత్రి నారా లోకేశ్‌లకు ప్రత్యేక ఆహ్వానం అందింది.జాతీయ స్థాయిలో ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేతకు ఈ ఆహ్వానం రావడం కూటమిలోని ఐక్యతను, ప్రాధాన్యతను సూచిస్తోంది. ఈ ఆహ్వానాన్ని మన్నించి, చంద్రబాబు మరియు లోకేశ్ ఈ వేడుకలో […]

ఎవ‌రూ అధైర్య ప‌డ‌కండి.. రైతుల‌కు కేటీఆర్ భ‌రోసా

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్య పడకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది.. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని […]

వైసీపీ నేత కారుమూరు వెంకట్ రెడ్డి అరెస్ట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఏపీలోని తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఇటీవల తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్‌కుమార్‌ హత్యలో సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న వెంకట్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ […]

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అమల్లో ఉన్న “రెండు పిల్లల నిబంధన”ను అధికారికంగా రద్దు చేసింది. ఈ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఇది అమల్లోకి వచ్చింది. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించింది.

డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలనీ కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మొదట సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON