loader

వైఎస్ జగన్‌‌కు పోలీసుల నోటీసులు… ఆ వాహనం సీజ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సింగయ్య మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఏ2గా ఉన్న వైఎస్ జగన్‌కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు… అక్కడ పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసు అందజేశారు. అలాగే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా… ప్రమాదానికి కారణమైనట్టుగా చెబుతున్న వాహనాన్ని కూడా […]

రైతు రుణ మాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశాడు..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి కేవలం 18 నెలల్లోనే రైతుల కోసం 4 వేల కోట్లు ఖర్చు చేశాం. రుణ మాఫీ, వరికి బోనస్, రైతు భరోసా అంటూ రైతులకి అండగా నిలిచాం. కేసీఆర్ మాత్రం అప్పులు, స్కాంలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, మిగులు రాష్ట్రానికి ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిపై వేశారు. రైతు రుణ మాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశాడని తీవ్ర ఆరోపణలు […]

మాజీ సీఎం జగన్ పై మరో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై తాజాగా మరో పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చి యార్డులో ఆయన నిర్వహించిన పర్యటనను ప్రస్తావిస్తూ నమోదు చేయబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ పర్యటన జరిగిందని, కోడ్‌ను ఉల్లంఘించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేత‌లు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా యార్డుకు వచ్చి హడావుడి చేశారని ఆరోపణలున్నాయి.

జగన్ ప్రతి విషయంలోనూ ప్రజలను మోసం చేశారు: షర్మిల

వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయడమే తప్పు అని కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు షర్మిల అన్నారు. జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఘటన జరిగిందని చెప్పారు. నెల్లూరులో జగన్ పై షర్మిల విమర్శలు చేశారు. మనుషుల పైకి కార్లు ఎక్కిస్తూ.. మానవత్వం గురించి మాట్లాడుతారా? అని జగన్ కు నిబంధనలు, ఆంక్షలు లేవా? అని ప్రశ్నించారు. 3 వాహనాలకు అనుమతిస్తే 30 వాహనాలతో వెళ్తున్నారని షర్మిల దుయ్యబట్టారు.

మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం – పవన్ కల్యాణ్ హెచ్చరిక

కూటమి ఐక్యత చెడకొట్టే పరిస్థితి లో నేను లేను.. 15 నుంచి 20 ఏళ్ళు ఉండే కూటమి ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, రావట్లేదు.గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం. అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ సరదాగా ఎవరూ లేరన్నారు

సింగయ్య మృతి పై స్పందించిన జగన్

తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని ప్రశ్నించారు. “జనం ఎక్కువగా ఉన్నప్పుడు, జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం,మీ ప్రభుత్వ డ్రైవర్ నడుపుతున్న వాహనానికి చుట్టూ రోప్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదా? ఒకవేళ భద్రత కల్పించి ఉంటే, వాహనం కింద మనుషులు ఎలా పడగలుగుతారు? మీరు భద్రత కల్పించలేదన్నది నిజమా, లేక వాహనం కింద ఎవరూ పడలేదన్నది నిజమా?” అని ఆయన నిలదీశారు.

గుజరాత్, పంజాబ్ లలో సత్తా చాటిన AAP

జూన్ 19న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలు వచ్చాయి. గుజరాత్‌లోని విశావదర్‌ను, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయం సాధించింది. గుజరాత్‌లోని కడిని బిజెపి కైవసం చేసుకుంది. కేరళలోని నీలంబర్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)‌కు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ కలిగంజ్‌లో టిఎంసి ఘన విజయం సాధించి తన పట్టును నిలుపుకుంది.

గాంధీ భవన్‌లో గొర్రెలు, మేకలతో నిరసన తెలిపిన యాదవులు

తెలంగాణలోని గాంధీ భవన్ మరోసారి వినూత్న నిరసనకు వేదిక అయింది. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెబుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన బాటపట్టారు. గొర్రెలు, మేకలను గాంధీ భవన్ ఎదుట మేపుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. గొర్రెలు, మేకలకు మందులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటిందని ఇంకా న్యాయం చేయలేదని వాపోయారు.

రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ తమ పాలనకు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక సభను నిర్వహించనుంది. “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో ఈ సభ రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షతో పాటు, గడచిన ఏడాది కాలంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలపై చర్చ జరగనుంది.

మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు వచ్చి వేచిఉన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON