loader

కరోనా డేంజర్‌ బెల్స్‌తో మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్‌ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.

దేశంలో కొత్త కరోనా వేరియంట్లు..

భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించాలి…

భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటే.. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపింది.

ఎపిలో తొలి కరోనా కేసు నమోదు

ఎపిలో విశాఖపట్నంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు. అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్ నుంచి కోలుకున్నా: శిల్పా శిరోద్కర్

కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్నా, మీరు కనబరిచిన ప్రేమకు థ్యాంక్స్, గురువారం ఆనందంగా ఉంది’ అంటూ బాంద్రావోర్లీ సీ లింక్‌లో కారు నుంచి ఓ ఫోటో కూడా పెట్టింది. మాస్క్‌లు ధరించమని, సురక్షితంగా ఉండమని ఆమె తన ఫాలోయర్లని కోరింది.

మళ్లీ మొదలైన కరోనా భయం

ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అప్పుడే 257 కొత్త కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.

వైద్య కళాశాలలకు ఇక రేటింగ్‌

ఇండిపెండెంట్‌ థర్డ్‌ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్‌), రేటింగ్‌ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మెడికల్‌ అసెస్‌మెంట్‌, రేటింగ్‌ బోర్డ్‌ రూపొందించిన మొత్తం 11 ప్రమాణాలు, 78 పారామితులతో ఒక ముసాయిదాను విడుదల చేసింది. వైద్య కళాశాలలు అత్యున్నత ప్రమాణాలు సాధించడం కోసం అవి జవాబుదారీతనం, నిబద్ధతతో పనిచేసేలా చేసేందుకు రేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎంసీ అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు.

తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్‌ కష్టాలు

గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలకు డీజిల్‌ కష్టాలు ఎదురయ్యాయి. డీజిల్‌ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదోని ప్రభుత్వ స్త్రీల, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఏడు‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ’ వాహనాలు ఉన్నాయి. హొళగుందకు చెందిన బేబీ అనే బాలింత ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి వేడుకుంది. ఆయన మాత్రం స్పందించలేదు.

డయాబెటిస్ రోగులకు భరోసా.. ఉచితంగా ఈ ఆసుపత్రుల్లో చికిత్స..

కేంద్ర ప్రభుత్వం టైప్‌-1 మధుమేహం చికిత్స కోసం 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ టైప్‌-1 డయాబెటిస్ బాధితులకు ఉచితంగా ఇన్సులిన్.. ఇతర అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. ఇన్సులిన్ కోసం నెలకు సుమారు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఖర్చు అవుతుందని.. అయితే ప్రభుత్వం ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా ఉచితంగా మందులను అందించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON