loader

సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌లో

రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు […]

కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు..

దేశంలో  పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు […]

ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ, నిధులు విడుదల

గర్భిణీ స్త్రీల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్దరించింది,51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం… 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేశారు.

కరోనా డేంజర్‌ బెల్స్‌తో మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్‌ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.

దేశంలో కొత్త కరోనా వేరియంట్లు..

భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించాలి…

భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటే.. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపింది.

ఎపిలో తొలి కరోనా కేసు నమోదు

ఎపిలో విశాఖపట్నంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు. అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్ నుంచి కోలుకున్నా: శిల్పా శిరోద్కర్

కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్నా, మీరు కనబరిచిన ప్రేమకు థ్యాంక్స్, గురువారం ఆనందంగా ఉంది’ అంటూ బాంద్రావోర్లీ సీ లింక్‌లో కారు నుంచి ఓ ఫోటో కూడా పెట్టింది. మాస్క్‌లు ధరించమని, సురక్షితంగా ఉండమని ఆమె తన ఫాలోయర్లని కోరింది.

మళ్లీ మొదలైన కరోనా భయం

ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అప్పుడే 257 కొత్త కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON