loader

యూట్యూబ్‌ డైట్ ప్రాణాన్ని తీసింది

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్ లో పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ యూట్యూబ్ వీడియోలు చూసి స్వయంగా ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గే ప్రయత్నంలో అకాల మరణానికి గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.

ప్రాణాలు తీస్తేస్తున్న నిఫా వైరస్..ఇద్దరు మృతి, డేంజర్‌లో 550 మంది

కేరళను నిఫా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయపడుతున్నారు. పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి జులై 12న మృతి చెందాడు. బాధితునికి నిఫా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు అంతకు ముందే మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిఫా ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. దీంతో వందలాది మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌పై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖకు పెద్ద సవాల్‌గా మారింది.

మళ్లీ నిఫా వైరస్‌ కలకలం.. యువతి మృతి

కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. మూడు జిల్లాల్లో పబ్లిక్‌ ఈవెంట్స్‌పై నిషేధం విధించారు. ఈ వైరస్ కారణంగా మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని  జులై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయింది,మరొకరు చికిత్స పొందుతున్నారు. యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?… క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. యువత కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయితే ఈ మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ఈ క్రమంలోనే పెద్దలలో ఆకస్మిక మరణాలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు మధ్య సంబంధం లేదని ఆ అధ్యయనాలు స్పష్టం చేశాయి.  వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ […]

హెచ్‌ఐవీ నివారణకు టీకా

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్‌ఐవీ వైరస్‌పై చిరకాల పోరాటం ఫలించింది. దశాబ్దాలుగా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చే హెచ్‌ఐవీ టీకాను అమెరికా ఆమోదించింది. కనీసం 35 కేజీల బరువున్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారికి ప్రెప్‌ ఇంజక్షన్‌గా ఉపయోగించడానికి ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చింది.

ఐదేళ్లలోపు చిన్నారుల కోసం బాల భరోసా

ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం మరో కొత్త ప్రథకాన్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘బాల భరోసా’ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోనుంది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఈ పథకం వివరాలను వెల్లడించారు. పథకం కింద ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

భారత్‌లో 5,755కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు

భారతదేశంలో కోవిడ్ -19 కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మరోసారి దేశంలో కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 7తేదీ ఉదయం 8 గంటల వరకు దేశంలో 5,755 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం 72 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఒడిశా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆరుగురు మృతి

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు.

4026కు చేరుకున్న కరోనా కేసులు..

మంగళవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా.. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే కేరళ ఎక్కువ కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే ఢిల్లీలోనూ గణనీయంగా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహల్ తెలిపారు. కాకపోతే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, అత్యధికంగా కేరళ

దాదాపు రెండేళ్ల తరువాత దేశంలో ఇప్పుడు కరోనా మరోసారి భయం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల 3 వేల వరకు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 1147 కరోనా కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7 మంది […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON