loader

ప్ర‌స‌వం కోసం.. బురద రోడ్డులో 2 కి.మీ. న‌డిచిన గ‌ర్భిణి..

కంగ్టి మండ‌ల ప‌రిధిలోని ఓ గిరిజ‌న తండాకు చెందిన నిఖిత భాయ్‌కు ఉద‌యం పురిటినొప్పులు వ‌చ్చాయి. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్స్‌కు  స‌మాచారం అందించారు.  తండాకు స‌రైన రోడ్డు  లేక‌పోవ‌డం, ఉన్న రోడ్డు బుర‌ద‌మ‌యంగా మార‌డంతో.. అంబులెన్స్ అక్క‌డికి చేరుకోవ‌డం క‌ష్ట‌మైంది. చేసేదేమీ లేక నిండు గ‌ర్భిణి తండా నుంచి 1.5 కిలోమీట‌ర్ల మేర కాలిన‌డ‌క‌న వెళ్లారు. పురిటి నొప్పులు భ‌రిస్తూనే ఆమె బుర‌ద‌లో న‌డిచింది. ఆ త‌ర్వాత ఆమెను అంబులెన్స్‌లో కంగ్టి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పండంటి […]

చే గువేరా

ఏర్నెస్టో”చే” గువేరా(జూన్ 14,1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.

డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్..

నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు. అయితే ఒక్కరు మాత్రం రెండు రోజుల క్రితం ప్రచారం చేపట్టారని, ఆయన మరెవరో కాదు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో పోరాడుతూనే ఉందని, తప్పకుండా తమిళనాడు పోరాడి గెలుస్తుందన్నారు. ఎడప్పాడి పళనిస్వామి లాగే ముఖ్యమంత్రి కూడా అణగిమణిగి ఉంటారని గవర్నర్‌ భావిస్తున్నారని, అయితే ఆ ఆశలు […]

ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు.

భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్‌ఎఫ్‌ స్టూడియోను సందర్శించారు. ర్‌ స్టార్మర్‌ పర్యటన సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది.

ముగిసిన ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం.. గాజాలో శాంతి పవనాలు వీచినట్టేనా..!

గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్‌, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా ఉందన్నారు అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారన్నారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు ట్రంప్‌. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ […]

సీజేఐపై దాడికి యత్నం.. సుప్రీంకోర్టులోకి ఆ న్యాయవాది ఎంట్రీ రద్దు

సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్‌ కిశోర్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేష్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటూ సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాకేష్‌ కిశోర్‌ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది.

సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ అక్టోబర్‌ 7న సూసైడ్ చేసుకున్నారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్‌ నోట్‌ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తన భర్తపై మానసిక వేధింపులు, కుల ఆధారిత వివక్ష, హింసకు పాల్పడ్డారని ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ పి కుమార్ […]

స్కూల్ బ‌స్సులో పొగ‌లు.. 25 మంది విద్యార్థులు సుర‌క్షితం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప‌రిధిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. స్కూల్ విద్యార్థుల‌తో వెళ్తున్న ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల బ‌స్సులో ఆక‌స్మికంగా పొగ‌లు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉంచాడు. అనంత‌రం పిల్ల‌లంద‌రిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేద‌న్నారు. డ్రైవ‌ర్ కూడా ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. పిల్ల‌ల‌ను మ‌రో బ‌స్సులో పాఠ‌శాల‌కు త‌ర‌లించిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు.

డీకే శివకుమార్ జోక్యంతో.. తెరుచుకున్న బిగ్ బాస్

కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో కోసం ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ హౌస్‌పై సీల్ వేసి షో నిర్వహణను నిలిపివేయగా, ఇది ,అభిమానులకు, షో నిర్వాహకులకు ఇబ్బందిని కలిగించింది. ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON