loader

అయ్యర్‌కు ఐసీసీ అవార్డు

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. మార్చి నెలకు గాను అయ్యర్‌కు ఈ అవార్డు దక్కింది. భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్‌.. ఆ టోర్నీలో 243 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు జాకబ్‌ డఫ్ఫీ, రచిన్‌ రవీంద్ర ఈ అవార్డుకు పోటీపడ్డా అయ్యర్‌ విజేతగా నిలిచాడు.

పోలీసింగ్‌లో తెలంగాణ మళ్లీ నం.1

ఇండియా జస్టిస్‌ రిపోర్టు-2025లో తెలంగాణ పోలీసులు ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 6.48/10 పాయింట్లతో తెలంగాణ తొలిస్థానం దక్కించుకుంది. పోలీసుశాఖకు నిధులు మంజూరు చేయడంతో అక్కడక్కడ మినహా.. పోలీసుల పనితీరు మెరుగుపడటంతో మళ్లీ తొలిస్థానంలో కొనసాగింది. ఇండియా జస్టిస్‌ రిపోర్టు ప్రకారం.. జైళ్ల సంక్షేమంలో తెలంగాణ 7వ స్థానానికి పడిపోయింది. లీగల్‌ ఎయిడ్‌ సర్వీసెస్‌లో తెలంగాణ ర్యాంకింగ్‌ 2025లో 10వ స్థానానికి దిగజారింది.

లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా దినేశ్‌ మహేశ్వరి

సుప్రీంకోర్టు జడ్జి దినేశ్‌ మహేశ్వరి 23వ లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు కమిషన్‌ సభ్యులుగా డీపీ వర్మ, హితేశ్‌ జైన్‌లను నియమిస్తూ ప్రధాని మోదీ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో వారు మంగళవారం బాధ్యతలు చేపట్టారని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మహేశ్వరి 2023 మేలో సుప్రీం కోర్టు జడ్జీగా పదవీ విరమణ చేశారు.

చార్లీ చాప్లిన్

చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు.

కర్ణాటకలో ట్రక్కుల సమ్మె

ఇంధన ధరల పెంపు, టోల్‌ ప్లాజాల వద్ద వేధింపులను నిరసిస్తూ కర్ణాటకలో ట్రక్కు యజమానులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంగ్రెస్‌ సర్కార్‌ తమ గోడు పట్టించుకోవటం లేదంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ కర్ణాటక స్టేట్‌ లారీ ఓనర్స్‌, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను చేపడుతున్నట్టు అసోసియేషన్‌ ప్రకటించింది. నిత్యావసరాల్ని రవాణా చేసే దాదాపు 6 లక్షల ట్రక్కుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఏడాదికి టోల్‌ 3 వేలు.. అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ఆఫర్‌

రహదారులపై టోల్‌ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా రూ.3 వేలు చెల్లించి ఏడాది పాటు టోల్‌ రుసుం చెల్లించకుండా ప్రయాణించేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కార్లు ఏడాది పాటు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఫాస్టాగ్‌ అకౌంట్‌ నుంచి చెల్లించాల్సి ఉంటుంది.

25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో రాహుల్ పర్యటన

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ రానున్నారు. ఈనెల 25, 26తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరుగనున్న భారత్ సమ్మిట్ లో ఆయన పాల్గొనున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోం ది. ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖులు హాజరుఅవుతున్నారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైంకర్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పా టు ఎంపి రాహుల్ […]

పెద్ద మనసు చాటుకున్న బ్యూటీ

హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సీ. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది. ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివసిస్తున్న కొంతమంది పేదలకు టేదలకు ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది ఈ భామ. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.

గులాబీ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం : మాజీ ఎంపీ వినోద్ కుమార్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. […]

ఈడీ ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్‌ పేర్లు..

దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి గాంధీ కుటుంబంపై ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి పేర్లను అందులో చేర్చారు. దీనిపై స్పందించిన హస్తం పార్టీ నేతలు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, బిజినెస్‌మెన్ రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON