loader

AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI సినిమా కన్నడలో వచ్చింది. ఈ ‘లవ్ యూ’ అనే సినిమాను కేవలం 10 లక్షలతో AI ద్వారా రూపొందించడం విశేషం. దర్శక నిర్మాత నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ AIతోనే చేశారు. 95 నిమిషాల సినిమా:  “95 నిమిషాల నిడివి గల సినిమాలో 12 పాటలున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యులు […]

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అక్కడే నిర్వహించనున్నారు. ఈ పర్యటన వ్యక్తిగతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర ఈ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్లనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.

పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేస్తున్న చిరు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఇప్పటివరకు వీరు జీతాల కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అయితే మే నెల నుంచి వారికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో పంచాయతీ ఉద్యోగుల్లో ఆనందావేశం నెలకొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా […]

భారతీయులకు చైనా స్నేహహస్తం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… వలసదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవకాశాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందా? ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85,000కిపైగా వీసాలను జారీ చేయడం విశేషం. మరింత మంది భారతీయ మిత్రులు మా దేశానికి వచ్చి.. సురక్షిత, ఉత్సాహభరితమైన, హృదయపూర్వక, స్నేహపూర్వకమైన చైనాను ఆస్వాదించండి’’ అని పిలుపునిచ్చారు.

వీకెండ్ రాజకీయాలు చేయొద్దు . . . సిఎం రేవంత్‌

ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని వీకెండ్ రాజకీయాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ హితవు పలికారు. ఎవరెవరూ ఏం మాట్లాడుతున్నారన్నది అంతా రికార్డ్ అవుతూ ఉందని జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన జీతం నుంచి రూ.25 వేలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది.  కార్యకర్తలు, పార్టీ నేతలు కాంగ్రెస్ […]

టెట్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఫీజులు చూసి గుడ్లు తేలేస్తున్న అభ్యర్ధులు!

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) మొదటి విడతకు ఏప్రిల్‌ 15 నుంచి అన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే టెట్ దరఖాస్తు ఫీజు చూసి అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు చేస్తే రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా నిర్ణయించినట్లు ప్రకటనలో విద్యాశాఖ పేర్కొంది. అయితే గతంలో టెట్ ఫీజుకు మినహాయింపు ఇస్తామని పగల్భాలు పలికిన విద్యాశాఖ ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే గతంలో మాదిరి ఫీజులు నిర్ణయించడం […]

రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కురియన్ కమిటీ

రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల రాజ్యాంగ పరమైన అధికారాలను పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు దక్కవలసిన హక్కులను కల్పించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పెంపొందించడానికీ ఈ కమిటీ కృషి చేస్తుందని స్టాలిన్ అన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ లో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్థన్ షెట్టి, ఆర్థికవేత్త ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు.

అదొక అదృష్ణం.. రజినీ ‘కూలీ’పై ఉపేంద్ర

రజినీకాంత్ కూలీ చిత్రంలో చాలా కేమియోస్ ఉన్నాయని అర్థం అవుతోంది. రజినీకాంత్ మెయిన్ హీరో అయినా కూడా నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ గెస్ట్ అప్పియరెన్స్ లిస్టులో ఉపేంద్ర కూడా చేరిపోయాడు. కూలీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని కూడా టీం ప్రకటించలేదు. కానీ ఉపేంద్ర మాత్రం అన్నింటినీ కన్ఫామ్ చేసేశాడు. కూలీ చిత్రంలో తాను నటిస్తున్నానని ఓపెన్‌గా చెప్పేశాడు.అసలు సిసలు పాన్ ఇండియా మూవీ అనిపించుకునేందుకు అన్ని ఇండస్ట్రీల హీరోల్ని […]

ఒత్తిడితో ఐదుగురు AI శాస్త్రవేత్తల మరణం..

AI రంగంలో చైనా, అమెరికా మధ్య సాంకేతిక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఈ సంవత్సరం,ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఐదుగురు అగ్రశ్రేణి AI శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధన వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని, […]

అయ్యర్‌కు ఐసీసీ అవార్డు

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. మార్చి నెలకు గాను అయ్యర్‌కు ఈ అవార్డు దక్కింది. భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్‌.. ఆ టోర్నీలో 243 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు జాకబ్‌ డఫ్ఫీ, రచిన్‌ రవీంద్ర ఈ అవార్డుకు పోటీపడ్డా అయ్యర్‌ విజేతగా నిలిచాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON