జపాన్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎంబసీలో విందు
వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. బుధవారం టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి శిబు జార్జ్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందానికి ఎంబసీలో విందు భోజనం ఏర్పాటు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, పలువురు అధికారులు ఈ విందులో పాల్గొన్నారు.