loader

ఐపీఎస్ ఆత్మహత్య.. స్పందించిన సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కులం కారణంగా బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనకు ఈ ఐపీఎస్ అధికారి మృతి ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో వేధించడం చూస్తే.. సామాన్య ప్రజల […]

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్‌మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. ఆర్చరీ లీగ్‌ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది. తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాలు చేయాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్‌లతో ప్రభుత్వం చర్చలు జరిపింది.

నకిలీ మద్యం కేసులో జనార్దనరావును రహస్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందుతుడు అద్దేపల్లి జనార్దనరావును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన విచారణలో మరిన్ని కీలకాంశాలు బయటపడతాయని ఎక్సైజ్అధికారులు భావిస్తున్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తోంది. టీడీపీకి చెందిన నేతలే ఈ కేసులో ఉండటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూటమి నేతలపై […]

మోహ్సిన్‌ నఖ్వీపై వేటు.. పీసీబీ చీఫ్‌ను డైరక్టర్‌ పదవి నుంచి తొలగించనున్న ఐసీసీ

ఆసియా కప్‌ ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భారత జట్టు తన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలన్న మంకు పట్టుతో ఉన్న నఖ్వీపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అతడిని గట్టిగా మందలించడం లేదా ఐసీసీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించడం వంటి వాటిలో ఏదో ఒకటి చేయవచ్చని విశ్వసనీయంగా తెలుస్తున్నదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ హరివంశ్ బచ్చన్ (జ.1942 అక్టోబరు 11) భారత సినీ నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. నాలుగు దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేశారు అతను భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. […]

భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మరోసారి తన సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమించింది. దీపికా ఈ బాధ్యత స్వీకరించడం తనకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు

అమెరికాలో భారీ పేలుడు: 19 మంది దుర్మరణం

అమెరికాలోని టెన్నెస్నీ రాష్ట్రం ఓ మిలిటరీ యుద్ద సామాగ్రి ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్‌కు చెందిన కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో 19 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి కారు ఎగిరిపడ్డాయి. మంటలు అంటుకోవడంతో కార్లతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ పేలుళ్ల కొన్ని కిలో మీటర్ల వరకు వినిపించాయి. పోలీసులు, ఎఫ్‌బిఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని […]

ఈ నెల 14న తెలంగాణ బంద్ : R.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన స్టే ఆర్డర్ రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్ని బీసీ సంఘాల సమన్వయంతో ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజర్వేషన్లపై స్టే విధించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON