loader

‘హెచ్‌సీయూ’లో ప్రజాస్వామ్యం ఖూనీ

హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్‌ వాటర్‌ అండ్‌ క్లైమెట్‌ చేంజ్‌ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించారు. ప్లానింగ్‌ దశలో ఐదు అంశాలను తప్పనిసరిగా జోడించాలని పేర్కొన్నారు. భూమి, నీరు, గాలి, శక్తి, ఓపెన్‌ స్పేస్‌లను ఐదు అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హెచ్‌సీయూ భూమి ప్రజల ఆస్తి అని, విద్యార్థులు చేసే ఆందోళనలకు ప్రజలు కూడా బాసటగా నిలవాలని కోరారు. […]

తిరుమలలో కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల తిరుపతి లో శ్రీవారిదర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా, పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.

లేజర్ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ,

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది.  ‘వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ఎంకే-II(ఏ) ల్యాండ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఇది యూఏవీ, డ్రోన్లను విజవయంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతోపాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసింది. దీని ద్వారా లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది’ అని డీఆర్డీవో తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్  కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో […]

పాదరక్షలతో తిరుమల ఆలయం వద్దకు వచ్చిన భక్తులు…ఏడుగురు సిబ్బంది సస్పెన్షన్‌

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు   పాదరక్షలతో ఆలయ మహాద్వారం వరకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం వైఫల్యం బహిర్గతమైంది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ […]

హరిహర వీరమల్లు రిలేజ్‌ డేట్‌‎పై క్లారిటీ..

హరి హర వీరమల్లు రిలేజ్‌ డేట్‌ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డబ్బింగ్‌, రీ రికార్డింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, ముందు ప్రకటించినట్టుగా మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఎనౌన్స్ చేశారు. పవన్‌ కల్యాణ్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకుడు.

మేం కళ్లుమూసుకుని కూర్చోలేం.. బెంగాల్‌లో హింసపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం

పశ్చిమ్ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలతో ముర్షిదాబాద్‌ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన హింసాత్మక ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కలకత్తా హైకోర్టు ఘాటుగా స్పందించింది. రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రేక్షకపాత్ర పోషించలేవని నొక్కిచెప్పిన హైకోర్టు.. కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, వారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.

మాధవ్ అరెస్ట్ లో నిబంధనల ఉల్లంఘన పోలీసు అధికారులపై వేటు..!!

పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పైన దాడికి ప్రయత్నించిన ఘటనలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసారు. ఈ పరిణామాల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అరెస్ట్‌ చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరు పర్చే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్‌ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై గుంటూరు సౌత్‌ డీఎస్పీతో విచారణ చేయించి, ఆ నివేదిక ఆధారంగా 11 మందిని […]

డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న గ్రామంలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా (14వ) జన్మించాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. భారతదేశ […]

తిరుమలలో భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 18 గంటల నుంచి 20 గంటల వరకు సమయం పడుతుంది. నిన్న తిరుమల వెంకన్నను 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు.హుండీ ఆదాయం రూ.3.33 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

డా. బాబాసాహెబ్ అంబేద్కర్

భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న గ్రామంలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా (14వ) జన్మించాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON