హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.