loader

బాలకృష్ణకి అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తాను ఇండస్ట్రీలో నటుడిగా 50ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నారు.లకృష్ణకి మరో అరుదైన గౌరవం దక్కించింది. వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్యకి స్థానం దక్కింది. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR).. యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం […]

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్‌

చైనాకు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) మళ్లీ ఇండియాకు రానుందనే చర్చ సాగుతోంది. 2020లో భారత ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో దీనిని నిషేధించింది. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది భారతీయ యూజర్లకు టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతోంది. ఇది టిక్ టాక్ రీఎంట్రీకి సంకేతమా అన్న చర్చ మళ్లీ మొదలైంది. శుక్రవారం నుంచి పలువురు యూజర్లు ఈ వెబ్‌సైట్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

శంకరవరప్రసాద్ నుండి మరో లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘మన శంకరవరప్రసాద్’ చిత్ర బృందం మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, అదే ఉత్సాహంతో చిత్ర యూనిట్ సెకండ్ లుక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్‌గా, పూర్తిగా కొత్త అవతారంలో కనిపించారు. ఇందులో ఆయన ఒక కుర్చీలో స్టైల్‌గా కూర్చుని, సిగరెట్ తాగుతూ ఉన్న పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పవన్ కళ్యాణ్‌ను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, స్పెషల్ మూమూంట్స్..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు.. మెగాస్టార్ దీనిపై స్పందించారు.. ఓ ట్వీట్ చేశారు. ‘జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!.. త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట‌.. ప్రతీ అక్షరం నా హృద‌యాన్ని తాకింది. అన్నయ్యగా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత‌, ప‌ట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గ‌ర్వప‌డుతూనే ఉన్నా.

మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అదిరిపోయే గ్లింప్స్

చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ ని తీసుకువచ్చారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. గతంలో విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానిని చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. లేటెస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.

విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి..

మెగాస్టార్ ఓ వీడియో చేశారు. సినిమా ఆలస్యం అవడం పై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫెక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని.. మెగాస్టార్ తెలిపారు. సినిమా ఓ చందమామ కథల హాయిగా సాగిపోతుంది.. అని చెప్తూ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చారు చిరంజీవి.విశ్వంభర..ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ.ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్‌ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ.

సావిత్రికి మరో వ్యక్తితో సంబంధం ఉంది.. మా కుటుంబాన్ని నాశనం చేసింది..

సావిత్రిపై జెమినీ గణేషన్‌ కూతురు సంచలన వ్యాఖ్యలు, ఆమె జీవితం తాగుడు వల్ల నాశనమైందని అంగీకరించలేక, నాన్న మీద నింద వేశారు. ఎవరికీ నిజం తెలియదు. మహానటి సినిమా వచ్చినప్పుడు నాన్నని హంతకుడని పోస్టర్లు అంటించారు. నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. ఇలాంటి తప్పులు చేసినందుకే ఆమెకు చివరికి శిక్ష పడింది” అని సావిత్రి గురించి కమలా సెల్వరాజ్ షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

పవన్ ఫ్యాన్స్‌కు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు..

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు థియేటర్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రిష్-జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాణంలో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూలై 24న గ్రాండ్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది. ఇక థియేటర్ల హంగామా ముగియగానే, సినిమా ఓటీటీ వేదికపైకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ […]

రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య.. ఆ టీడీపీ నేత కుమార్తె

టాలీవుడ్ ఫేమస్ సింగర్.. రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హరిణ్య రెడ్డి అనే యువతితో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు బయటకు రావడంతో హరిణ్య రెడ్డి ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది తెలుగు దేశం పార్టీ టీడీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA)  ఛైర్మన్  కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్య రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON