loader

మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరిన మంచు పంచాయితీ..

మంచు మోహన్‌బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. పెదరాయుడి కుటుంబంలో ఫైట్‌కు కాస్తా బ్రేక్‌ పడిందనుకునేలోపే.. మళ్లీ వైలెంట్‌ సీన్లు దర్శనమిస్తున్నాయి. తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్‌లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్‌. జల్‌పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ.. విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు.

పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని.. కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా తానే ఇన్ […]

కొన్ని సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు..

తమిళంలోనూ ఓ సినిమాపై ఇలాంటి క్రేజే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలా రిలీజ్ అయిందో లేదో.. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది ఆ దెబ్బకుగుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. […]

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

ఆదాయపు పన్ను శాఖ నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. 2022లో విడుదలైన మూడు సినిమాల నుండి పృథ్వీరాజ్ సంపాదించిన ఆదాయం గురించి వివరాలను స్పష్టం చేయాలని నోటీసులో కోరారు. ఎంపురాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి రాజకీయ వివాదాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. “నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేము ఎలాంటి దర్యాప్తుకూ భయపడము” ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తోన్న వారికి కృతజ్ఞతలు […]

‘ఎంపురాన్‌’ నిర్మాతపై ఈడీ దాడులు

మలయాళ సినిమా ‘ఎంపురాన్‌’ నిర్మాత గోకులం గోపాలన్‌ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా దాడులు చేపట్టింది. చెన్నై, కొచ్చి, కర్ణాటకలలో ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి కీలక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిపిన సోదాల్లో రూ.1.5 కోట్ల నగదును ఈడీ సీజ్‌ చేసినట్టు తెలిసింది. అక్రమ నగదు లావాదేవీలతో వచ్చిన నిధులను ఉపయోగించి ‘ఎంపురాన్‌’ సినిమా తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాజమౌళి బోనులో నుంచి బయటపడ్డ సింహం…

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోలో తన పాస్ పోర్ట్ ను జక్కన్న నుంచి వెనక్కి తెచ్చుకున్నట్టు చూపించడం వైరల్ గా మారింది. గతంలో మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, ఆయనని బోన్లో […]

రక్తంతో పవన్ కల్యాణ్ చిత్ర పటం గీసిన డై హార్డ్ ఫ్యాన్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామానికి చెందిన ఇంట‌ర్ విద్యార్థి వెంక‌ట హ‌రిచ‌రణ్ చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలనుకున్నాడు. అంతే.. తన రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం గీశాడు.తను రక్తంతో గీసిన పవన్ కల్యాణ్ ఫొటోను మంత్రి కందుల దుర్గేష్‌కి అంద‌జేశారు. తాను ప‌వ‌న్ కల్యాణ్ వీరాభిమాని అని, ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా […]

మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..

కుంభమేళాలో పూసలు అమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ల సుందరి మోనాలిసా కు సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాను 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే సినిమా ఆఫర్‌ ఆశ చూపించి ముంబాయిలో ఆమెతో సహజీవనం చేసినట్టు . పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని.. సనోజ్ అమాయకుడని సదరు యువతి […]

రామ్ చరణ్ పెద్ది టీమ్.. వీడియో గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..

గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ మాస్ అవ‌తార్‌ని చూసి అంద‌రూ అభినందించారు. ఈ పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో సంచ‌లనాన్ని సృష్టించాయి. పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్‌. ‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ […]

మెగా 157 పూజా కార్యక్రమాలు.. అతిథిగా వచ్చిన అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మెగా 157 ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభమైంది. రామా నాయుడు స్టూడియోలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈవెంట్‌కు అల్లు అరవింద్, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, బాబీ, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల వచ్చారు. ఇక వెంకీ మామ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON