వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు..
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్ రావడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద మండిపడ్డారు. కమల్ హాసన్ పోస్టుని ట్యాగ్ చేస్తూ.. ”ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి” అని చిన్మయి రాసుకొచ్చింది. గతంలో ‘మీటూ’, కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో వైరముత్తుపై చిన్మయి […]
తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వైరముత్తు, నాలుగు దశాబ్దాలుగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నవలలతో కలిపి ఆయన 37కు పైగా పుస్తకాలను రచించారు. ఇక సినీ గీత రచయితగా అనేక హిట్ గీతాలతో తనకంటూ ప్రత్యేక […]
అజిత్ కు 30 లక్షల గిఫ్ట్.. ప్రపంచంలోనే మొదటి ఫార్ములా E థీమ్ SUV
కార్ రేసింగ్‌పై అజిత్‌కు ఉన్న ఆసక్తిని మెచ్చుకుంటూ, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ విభాగం హెడ్ వేలుస్వామి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫార్ములా E థీమ్ SUV కారైన ‘మహీంద్రా BE ఫార్ములా E ఎడిషన్’ను అజిత్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. విశేషమేమిటంటే, ఈ కారు లాంచ్ ఈవెంట్‌లో నటుడు అజిత్ కూడా పాల్గొన్నాడు.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ బెనిఫిట్ షోకు గ్రీన్‌సిగ్నల్- టికెట్ రేట్ ఎంతో తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ , హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఈనెల 19న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఉస్తాద్ సినిమాకు బెనిఫిట్ షోతో పాటుగా టికెట్ రేట్ పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 19న తెల్లవారుజామున 4- 5గంటల మధ్యలో బెనిఫిట్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో […]
అల్లు అర్జున్ హాలీవుడ్‌కి వెళ్లాలి, మన పోటీ వాళ్లతోనే.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ కి చెందిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన పోటీ ఇకపై బాలీవుడ్‌తో కాదు, ప్రపంచ స్థాయి సినిమా అయిన హాలీవుడ్‌తోనే ఉండాలి` అని అన్నారు. `అల్లు అర్జున్ లాంటి టాలెంట్ ఉన్న నటులు కేవలం పాన్-ఇండియా స్టార్‌గా ఉండిపోకూడదు. ఆయన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాలి. మన తెలుగు నటుల సత్తా ఏంటో ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరాలి. తెలుగు సినిమాకు ఆ శక్తి ఉంది` అని చెప్పారు […]
అల్లు సినిమాస్ వాల్ ఆఫ్ ఫేమ్‌లో లెజెండరీ డైరెక్టర్ల లిస్టులో బాపు, ఆర్జీవీ, శంకర్‌లకు దక్కని ప్లేస్…
‘అల్లు సినిమాస్’ థియేటర్‌లో వాల్ ఆఫ్ ఫేమ్ పేరుతో ఇండియాలోని దిగ్గజ దర్శకుల ఫోటోలను ఏర్పాటు చేశారు అయితే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, రిషబ్ శెట్టి, అట్లీ వంటి రెండు, మూడు సినిమాలు తీసిన డైరెక్టర్లను లెజెండరీ డైరెక్టర్లుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎక్కించడంతో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. భారత సినీ చరిత్రలో గర్వంగా చెప్పుకునే కేవీ రెడ్డి, జంధ్యాల, బాపు, రామ్ గోపాల్ వర్మ, సింగీతం, కోదండ రామిరెడ్డి,కృష్ణవంశీ,శంకర్ వంటి దర్శకుల ఫోటోలు […]
8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక
ఇటీవల రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్, రష్మిక రద్దుచేసుకొన్న నిశ్చితార్థం, నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన విభేదాల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో ఎనిమిదేళ్ల క్రితం ఒక కన్నడ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించినదని, కన్నడ మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని, ఆడియో క్లిప్‌లను 24 గంటల్లోగా తొలగించాలని రష్మిక డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలపై […]
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి
నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు.
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్ ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్ చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగ్రామ్లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ […]

