loader

రజనీ, బాలయ్యకు అరుదైన గౌరవం- సన్మానించనున్న IFFI

56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)గోవాలో అట్టహాసంగా జరగనున్నాయి. అయితే ఈఏడాది ఈవెంట్​లో సౌత్ హీరోలు రజనీకాంత్ , బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. వారు 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు అగ్ర హీరోలను గోవా అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దేశంలోని వివిధ ప్రాంతాల […]

పోలీసులకు అభినందనలు.. ఐబొమ్మ రవి అరెస్ట్ పై పవన్ కళ్యాణ్

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ” డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. . పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం అని పవన్ తెలిపారు.

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం.. పోలీసులపై సినీ ప్రముఖుల ప్రశంసలు

టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ సైట్ యజమాని రవిని పోలీసులు అరెస్ట్ చేయడం సంతోషం కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పైరసీ అనేది సినీ పరిశ్రమకు ఛాలెంజింగ్‌గా మారింది. సినిమాను నమ్ముకొని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పైరసీపై యుద్ధం జరుగుతూనే ఉండాలి అని చిరంజీవి అన్నారు. అలాగే రాజమౌళి మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక సినిమా సీన్‌లా ఉందన్నారు. రవి అరెస్ట్‌లో పోలీసుల చొరవకు ధన్యవాదాలు తెలిపారురాజమౌళి. హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు నిర్మాత […]

అతి త్వరలో మళ్లీ కలుద్దాం.. ‘వారణాసి’పై మహేష్ బాబు, రాజమౌళి ట్వీట్లు వైరల్

గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు, మీడియాకు మహేష్, రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల ఓర్పు, క్రమశిక్షణను రాజమౌళి ప్రశంసించారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి వస్తున్న ఆదరణకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. “నా అభిమానులు, మీడియా, దూర ప్రాంతాల నుండి వచ్చి చిత్ర బృందాన్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించి ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అతి త్వరలో మనందరం మళ్లీ కలుద్దాం” అని మహేష్ బాబు […]

ది టైటిల్ రివీల్ మాత్రమే.. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా.. మహేష్ బాబు..

” నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు.. ఆయనెప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమనేవారు.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఇ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్.. నా దర్శకుడిని గర్వపడేలా చేస్తా.. వారణాసి రిలీజ్ అయినపుడు ఇండియా మొత్తం మమ్మల్ని చూసి గర్వపడుతుంది.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అనేది మీకు చాలా చిన్నమాట” అని మూవీ తొలి ఈవెంట్ లో మహేష్ బాబు అన్నారు.

‘వారణాసి’ -ఇట్స్ అఫీషియల్- గ్లోబ్​ట్రాటర్​ టైటిల్ ఇదే!

యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ ప్రకటించేశారు. ఈ సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ ఇవాళ గ్రాండ్ ఈవెంట్​లో రివీల్ చేశారు. కాగా, ఇందులో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నట్లు రాజమౌళి అనౌన్స్ చేశారు. ఈ టైటిల్​ గ్లింప్సే ఈవెంట్​లో ఫ్యాన్స్​కు గుస్​బంప్స్ తెప్పించింది. అంచనాలకు తగ్గట్లే వీడియో గ్లింప్స్​ను డైరెక్టర్ రాజమౌళి డిజైన్ చేశారు.

బెట్టింగ్ యాప్​ కేసు – సీఐడీ విచారణకు హాజరైన సినీ నటుడు రానా

సినీ నటుడు రానా దగ్గుబాటి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో సిట్‌ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. ఇంతకు ముందే సీఐడీ సిట్‌ విచారణకు యాంకర్‌ విష్ణుప్రియ సైతం హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి విష్ణుప్రియను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను సిట్‌ అధికారులు విచారణ చేశారు. ఇటీవల విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను సిట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఖండ 2 ఈవెంట్లో డైరెక్టర్ల మీద నందమూరి బాలకృష్ణ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ  అఖండ 2 తాండవం ఫస్ట్ సింగల్ విడుదల సందర్భంగా ముంబై లో ఒక ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి కేవలం 130 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసారంటూ టాలీవుడ్ డైరెక్టర్ల మీద సెటైర్లు కూడా వేసాడు. ఇప్పటి డైరెక్టర్లు బోల్డంత ఖర్చు చేస్తూ, రోజుల తరబడి షూటింగ్లు చేస్తున్నారంటూ కామెంట్ చేసాడు. ఈ సెటైర్ ఇప్పటి తరంలో కొంతమంది దర్శకులను ఉద్దేశించే అనే చర్చమొదలైయింది. అదిగో బాలయ్య పలానా డైరెక్టర్ నే అన్నాడంటూ అప్పుడు […]

పాస్‌పోర్టులు పంచుతోన్న జక్కన్న… ‘గ్లోబ్ ట్రోటర్‌’ ఈవెంట్‌కి

SSMB 29′, ‘గ్లోబ్ ట్రాటర్’ వంటి వర్కింగ్‌ టైటిల్స్ తో పిలవబడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కి పాసులు ఉన్నవారే రావాలని రాజమౌళి చెప్పగా.. తాజాగా ఆ ఎంట్రీ పాస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూస్తే ఎవరూ పాస్ అనుకోరు. పాస్‌పోర్ట్‌లా కనిపించే ప్రత్యేక ‘గ్లోబ్ ట్రోటర్’ ఎంట్రీ పాస్ […]

హైదరాబాద్ బిర్యానీకి ప్రియాంక చోప్రా ఫిదా

హైదరాబాద్‌లో ఉన్న ప్రియాంక హైదరాబాద్ రుచులతో పాటు ఆతిథ్యాన్నీ ఆస్వాదిస్తున్నారు. బుధవారం రాత్రి తన X ఖాతాలో ‘Ask PCJ’ సెషన్ పెట్టిన ప్రియాంకని ఓ ఫ్యాన్, ‘తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారా?’ అని అడిగాడు. అదిరిపోయింది’ అని తెలుగులో రాసి, హైదరాబాద్ బిర్యానీని ప్రపంచంలోనే బెస్ట్ అని పొగడటం… ఈ ఒక్క ట్వీట్‌తో నిమిషాల్లోనే వేల సంఖ్యలో రిప్లైలు, బిర్యానీ ఫోటోలు, బెస్ట్ బిర్యానీ పాయింట్స్ సజెషన్స్‌తో X నిండిపోయింది.సోషల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON