loader

లైవ్ షోలో ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌ పై రాళ్లు, సీసాలతో దాడి

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో రాళ్ల దాడి జరిగింది. ఆదివారం ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ(DTU)లో జరిగిన ఎంగిఫెస్ట్ 2025(Engifest 2025) సందర్భంగా చోటు చేసుకుంది. సోనూ నిగమ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో లక్షకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. లైవ్ షో జరుగుతుండగా..  ఈ దాడి వల్ల ఆయన తన షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో సోనూ నిగమ్ గాయపడలేదని, కానీ అతని టీమ్ లోని కొందరు సభ్యులు తీవ్రంగా […]

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శతక్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ రివీల్ చేయనున్నారట మేకర్స్.

జపాన్‌లో ‘ఎన్టీఆర్’ తుఫాన్: ఇండియన్ స్టైల్లో ఫ్యాన్స్ రచ్చ!

జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR యొక్క భారీ విజయం తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది . దేవర రిలీజ్ కోసం అక్కడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో వీరాభిమానులు ఎలా ఎన్టీఆర్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్తోంది. ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తున్న అమ్మాయిలు వీడియోలో ఉన్నారు. ఎన్టీఆర్‌ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనలకు హాజరయ్యేందుకు, అభిమానులతో ముచ్చటించేందుకు […]

మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్

లండన్‌ పర్యటనకు వస్తున్న చిరంజీవిని కలిసేందుకు.. అభిమానులతో చిరంజీవి సమావేశమవుతారని.. ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేశారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి పనిని నేను అంగీకరించను. దీనిని ఖండిస్తున్నా’ అని చిరంజీవి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘అభిమానుల సమావేశం పేరిట డబ్బులు వసూళ్లు చేసిన వారు వెంటనే తిరిగి ఇచ్చేయండి’ అని మెగాస్టార్‌ ఆదేశించారు.

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు..రియాక్షన్

ప్రకాష్ రాజ్ : బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ను తొమ్మిదేళ్ల క్రితం చేశానని, తప్పు తెలుసుకుని తర్వాత యాడ్‌ను ఆపివేయాలని సంస్థను కోరానని తెలిపారు. విజయ్ దేవరకొండ టీం : చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవర కొండ ప్రచారం నిర్వహించాడని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గుబాటి రానా టీం : రానా దగ్గుబాటి స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశారని ఆయన టీం ఓ ప్రకటనలో […]

టాలీవుడ్‌కు బెట్టింగ్ షాక్

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు  దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీతా, నిధి అగర్వాల్, అనన్యా నాగళ్ల,  టీవీ నటులు, యాంకర్స్  యూట్యూబర్స్,  అయిన  సిరి హన్మం తు, శ్రీముఖి, వర్షీణి సౌందరాజన్, వాసంతి కృష్ణన్, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహ పటాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామలా, తస్యతేజ్, రీతు చౌదరి,  సుప్రితపై […]

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు.. ముగిసిన విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ

్రస్తుతం బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసు ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు మేరకు.. విష్ణుప్రియ, రీతూ చౌదరి గురువారం విచారణకు హాజరయ్యారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ప్రస్తుతం అవి వైరల్‌ అయ్యాయని రీతూ చౌదరి పేర్కొంది. అలాగే, విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ని సైతం పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్‌ కిరణ్‌ని సైతం పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే మిగతా వారికి నోటీసులు జారీ […]

చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్రేజీ కామెంట్స్..

చిరంజీవికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. దీంతో చిరుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంపై పవన్‌ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని తెలిపారు.

రజినీకాంత్ కూలీ షూటింగ్ కంప్లీట్.. స్పెషల్ వీడియో వదిలిన టీమ్

సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అంతేకాకుండా షూటింగ్‌కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసింది. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ని  ఏకంగా రూ.120 కోట్లకి ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసినట్లు టాక్.

పవన్ కళ్యాణ్‌గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్.. ప్రకాష్ రాజ్

దేశవ్యాప్తంగా తమిళనాడు ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.. నటుడు ప్రకాష్‌ రాజ్‌. చిత్రాడ సభలో హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON