loader

రెవెన్యూ దందా..!

సంతనూతలపాడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయింది. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండుతోంది. ఎకరా భూమి ఆన్‌లైన్‌ చేయాలంటే రూ.40 వేల వరకు వసూలు. బాబూరావు అలియాస్‌ బోసుబాబు గత జనవరి  మార్చి 4వ తేదీ వరకు తన స్థలానికి పొజిషన్‌ ధ్రువీకరణ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరుచేయలేదు. విసిగిపోయిన అతను తహసీల్దార్‌ కారుకు అడ్డుగా నిరసన తెలిపారు. చివరకు పోలీసుల చేత అతనిని ఆందోళనను నిలిపివేయించారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్‌ -కరీంనగర్‌ -నిజామాబాద్‌ -ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరికివారే గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అరకు ఉత్సవ్‌ జరుగుతుండడంతో  ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను తిలకిస్తూ సాయంత్రానికి అరకులోయ చేరుకుని ఉత్సవ్‌లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక,  అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ,  డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి,  తారాబు జలపాతం, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువులవేనం, లంబసింగి ప్రాంతాలు రద్దీగా […]

బాసరకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి వేళ బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో మూడు నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది. నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు కాలినడకన బాసర చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

తెలంగాణలో బెన్‌ఫిట్ షోలు రద్దు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సినిమాలకు ఇకపై ఎలాంటి బెన్ ఫిట్ షోలు చూసే వీలు లేదు. ఈమేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ ధరలు, స్పెషల్ షోలకు సంబంధించిన అనుమతులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కీలక నిర్ణయం వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫి చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని సూచించింది. ఆ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత.. ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ముందు ఎలాంటి షోలు అనుమతించొద్దని ఆదేశించింది.

రుణమాఫీలో సీఎం విఫలం…

రెండు లక్షల రుణమాఫీ చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్వీ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.

మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గ వార్తలు , త్వరలో అందిస్తాము

ప్రస్తుతం జిల్లా వార్తలు లోకల్ న్యూస్ అందుబాటులో లేవు రాష్ట్ర వార్తలు మరియు ప్రధాన వార్తలు మాత్రమే అందిస్తున్నాము గమనించండి , లోకల్ న్యూస్ మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , మీ గ్రామ వార్తలు త్వరలో అందిస్తాము

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON