loader

భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్‌ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్‌గా లాంఛ్‌ చేసింది. ఈ ఈవెంట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలిషోరూం కోసం టెస్లా సంస్థ వై మోడల్‌ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి […]

ఇంకెన్ని పెట్రోల్‌ బంకులు పెడతార్రా సామి..

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో 70వేల జనాభ,18వేల వాహనాలు..15 పెట్రోల్ బంకులు ఉండగా.. మరో 12 ఏర్పాటు చేస్తుంది ఆంధ్ర ప్రాతంతో పోల్చితే యానాంలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ,14 తక్కువగా ఉండటమే ఇందుకు ప్రదాన కారణం. యానాం నుండి కొందరు వ్యక్తులు అక్రమంగా డీజిల్, పెట్రోల్ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారని.. ఇన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి అదే ప్రధాన కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. యానాం నుండి పెద్ద ఎత్తున మాఫియా డీజిల్, పెట్రోల్ […]

సుంకాల మోతకు సిద్ధమైపోయిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతకు సిద్ధమైపోయారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాలపై సుంకాల విధింపునకు ట్రంప్ రెడీ అయ్యారు. ఆయా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వచ్చే నెల (ఆగస్ట్) ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

పన్ను ఎగవేతలు అడ్డుకోవడానికి టెక్నాలజీ ఉపయోగించండి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పన్ను విధానాలు, జీఎస్టీ వసూళ్లపై కీలక చర్చలు జరిగాయి. సీఎం స్పష్టంగా పేర్కొన్న విషయం టెక్నాలజీ ఉపయోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవడం అవసరం.పన్ను ఎగవేతలు గుర్తించేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పరంగా దేశానికి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

టీసీఎస్ ఉద్యోగులను వెంటాడుతున్న భయం..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి క్లయింట్ డీల్ వాయిదాలు, ఒప్పందాల ఆలస్యం వంటి అంశాల వల్ల సాలరీ రివిజన్‌ గురించి తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. TCS సాధారణంగా ఏప్రిల్ 1న జీతం పెంపు ప్రక్రియను, ఉద్యోగులకు సాలరీ ఇన్క్రిమెంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఉద్యోగులు ఆందోళనలో […]

ముంబైలో టెస్లా తొలి షోరూమ్

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో ప్రపంచాన్ని ఊపేసిన ఎలోన్ మస్క్ టెస్లా ఇప్పుడు భారతదేశపు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో, టెస్లా తన తొలి “అనుభవ కేంద్రాన్ని” జూలై 15న ముంబై నగరంలో ప్రారంభించనుంది. ఈ షోరూమ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ప్రముఖ వ్యాపార కాంప్లెక్స్ “మేకర్ మాక్సిటీ” భవనంలో ఏర్పాటు చేయనుంది. టెస్లా, దక్షిణాసియా మార్కెట్లో తన పట్టు పెంచేందుకు మొదటి దశలో ముంబై, తర్వాత న్యూఢిల్లీ (ఏరోసిటీ)లో షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

మరో బ్యాంకు.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ రద్దు

బ్యాంక్ ఆఫ్ బరోడా పొదుపు ఖాతాదారులకు పెద్ద ఉపశమనం కల్పించింది. ఇప్పుడు వినియోగదారులు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటెన్‌ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకున్నా ఎలాంటి జరిమానా ఉండదు. గతంలో కెనరా బ్యాంక్, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందించాయి. ప్రీమియం పొదుపు ఖాతా పథకాలపై ఈ తగ్గింపు వర్తించదని గుర్తుంచుకోండి.

దేశంలోనే తొలి యూపీఐ ఎటిఎం

స్లైస్ బ్యాంక్ బెంగళూరులోని కోరమంగళలో సరికొత్త యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను ప్రారంభించింది. ఇది బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఖాతాదారులు ఇప్పుడు డిజిటల్ బ్యాంక్ శాఖకు వెళ్లి, వేగవంతమైన సేవలను పొందవచ్చని స్లైస్ బ్యాంక్ తెలిపింది. UPI ATM ద్వారా డబ్బులు తీసుకోవచ్చు, డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఖాతాలు తెరవడం, ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా ఈ యూపీఐ ఆధారిత బ్రాంచులో పొందవచ్చని పేర్కొంది.

భారత్ జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డ్..

భారతదేశం జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం ఎక్కువ. అంతేకాదు, గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. సగటు నెలవారీ వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్..

విశాఖ హైవేపై రాయుడు మిలిటరీ హోటల్‌లో తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్‌వెజ్ వడ్డిస్తుండటం వివాదాస్పదమైంది. శ్రీవారి గర్భాలయ నమూనాను ఏర్పాటు చేసి మాంసాహారం వడ్డిస్తుండటంతో హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం మాత్రం గర్భాలయ నమూనా ఎదురుగా వెజ్ మాత్రమే వడ్డిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON