loader

్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం!.. జనాల నుంచి కోట్లు కాజేసిన కేటుగాళ్లు!

కరీంనగర్‌ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి ఒక కంపెనీ అమాయక ప్రజలను నిండా ముంచేసింది. 25 నుంచి 30 శాతం వరకు వడ్డీ వస్తుందని  కస్టమర్లను నమ్మించేందుకు మొదట అధిక వడ్డిలు ఇచ్చారు.  గత ఆరు నెలల నుంచి పూర్తిగా లావాదేలు ఆగిపోయాయి. రాజకీయ పార్టీకి చెందిన నేతలు, పోలీసు అధికారులు అందరూ.. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. కానీ ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయడం […]

యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై

కర్ణాటకలో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు యూపీఐ (UPI) చెల్లింపులను అంగీకరించడం మానేశారు. నగదు లావాదేవీలకు తిరిగి మారుతున్నారు. దీనికి కారణం కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ నోటీసులు పంపుతూండటమే. లక్షల రూపాయల పన్ను బకాయిలుఉన్నాయని కట్టాలని ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. బెంగళూరు, మైసూరు, తర ప్రాంతాలలో చాలా మంది వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్‌లను తొలగించారు. నగదు మాత్రమే అని బోర్డులు ఏర్పాటు చేశారు.

TCSను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్..

ఇండియాలోని టాప్ కంపెనీల ర్యాంకింగ్స్‌లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ వన్ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఆ తర్వాతి స్థానంలో HDFC బ్యాంక్ కొనసాగుతోంది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ టాప్-3లోకి ఎంట్రీ ఇవ్వడంతో, TCS నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, IT కింగ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను వెనక్కి నెట్టి, ఇండియాలోనే మూడవ అత్యంత పవర్‌ఫుల్ లిస్టెడ్ కంపెనీగా అవతరించింది

కూరగాయలు అమ్మితే కోట్లు వస్తాయా ? కానీ జీఎస్టీకి బుక్ అయ్యారు

కర్ణాటకలో హవేరికి చెందిన శంకర్‌గౌడ హదిమణి రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి తన దుకాణంలో వాటిని విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కస్టమర్లు అధికంగా డిజిటల్ చెల్లింపులే చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు అతనికి రూ. 29 లక్షల నోటీసు జారీ చేశారు.నాలుగేళ్లలో అతని అకౌంట్స్ ద్వారా రూ. 1.63 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. వాస్తవానికి, ప్రాసెసింగ్ లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన తాజా కూరగాయలపై GST వర్తించదు.

ఫ్రాడ్‌ జాబితాలోకి అనిల్‌ అంబానీ..! CBIకి ఫిర్యాదు చేసే ఆలోచనలో SBI

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని “ఫ్రాడ్‌” జాబితాలో చేర్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిబిఐకి కూడా ఫిర్యాదు చేసే ప్రక్రియలో SBI ఉందని సోమవారం పార్లమెంటుకు సమాచారం అందింది. ఈ సంస్థలను జూన్ 13, 2025న మోసం రిస్క్ మేనేజ్‌మెంట్‌పై RBI మాస్టర్ డైరెక్షన్స్, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్, నిర్వహణపై బ్యాంక్ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం మోసంగా వర్గీకరించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక […]

ఏపీలో అక్కడ లులు షాపింగ్ మాల్.. మొదలెట్టకముందే తలనొప్పులు!

విజయవాడలో లులు మాల్ నిర్మాణం కోసం పాత బస్ డిపోలో ఐదు ఎకరాల భూమిని అప్పగించాలనే ప్రతిపాదన రాగా.. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. డిపో బదులుగా గొల్లపూడి ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని అందిస్తామని ఏపీఐఐసీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 200 మంది మహిళా కండక్టర్ల, 1,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని ఆర్టీసీ ఉద్యోగులు […]

నెల్లూరులో కుబేరా.. అక్కడ బిచ్చగాళ్లు.. ఇక్కడ గిరిజనులు?

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో యాక్సిస్ బ్యాంక్‌ను కేంద్రంగా చేసుకుని 10.60 కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసిగిరిజనులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి, నకిలీ కంపెనీల ద్వారా 56 మంది పేరిట లోన్లు తీసుకున్నారు. ఆరు నెలలు పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్ క్రియేట్ చేసి లోన్లు తీసుకున్నారు. అయితే ఈ స్కామ్ 2022 -24 మధ్య జరిగింది. గిరిజనులకు బ్యాంక్ నుంచి లోన్ నోటీసులు రావడంతో గిరిజనులు ఈ […]

నో యూపీఐ….ఓన్లీ క్యాష్…బెంగళూరులో వ్యాపారులు

భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో డిజిటల్ పేమెంట్లకు చిరువ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు ఇలా ఏ దుకాణంలో చూసినా “నో యూపీఐ….ఓన్లీ క్యాష్ (No UPI,Only Cash )” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. బెంగళూరులో రోడ్డు పక్క ఫుడ్‌ స్టాళ్లు, తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌ దుకాణాలతో సహా బెంగళూరులో అనధికారికంగా వ్యాపారాలు చేసుకునే వారికి జీఎస్‌టీ నోటీసులు వచ్చాయి. టాక్స్ అఫీషియల్స్ నుండి వేధింపులు రావచ్చనే భయంతో యూపీఐ […]

టెర్మినేషన్ లెటర్‌లో అలా రాస్తారా- మాజీ ఉద్యోగికి 2 లక్షలు ఇవ్వండి

విప్రో లిమిటెడ్‌ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రాకు ఇచ్చిన టెర్మినేషన్ లెటర్ లో పరువు తీసేలా వాక్యాలు ఉన్నాయని అందుకు గాను రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ లేఖలో “మాలిషియస్ కండక్ట్” (దురుద్దేశపూరిత ప్రవర్తన) , “కంప్లీట్ లాస్ ఆఫ్ ట్రస్ట్” (పూర్తి విశ్వాసం కోల్పోవడం ) వంటి పదాలు ఉన్నాయి. ఇవి మిశ్రా వృత్తిపరమైన గౌరవాన్ని , భవిష్యత్ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని […]

అట్టహాసంగా ముగిసిన బిమ్‌స్టెక్ పోర్ట్స్ కాన్‌క్లేవ్

విశాఖపట్నం సముద్రతీరంలో రెండు రోజులుగా సాగిన బిమ్‌స్టెక్ పోర్ట్స్ కాన్‌క్లేవ్ అట్టహాసంగా ముగిసింది. నోవోటెల్‌ హోటల్‌ వేదికగా ఈ కాన్‌క్లేవ్ రెండవ రోజు మరింత గణనీయంగా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి, నౌకాశ్రయాల సామర్థ్యం పెంపు, క్రూయిజ్ పర్యటనల విస్తరణ, మానవ వనరుల సద్వినియోగం వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం బిమ్‌స్టెక్ దేశాల మధ్య వాణిజ్యం కేవలం 7% మాత్రమే ఉండటం ఆందోళనకరం అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON