loader

ఒక్క రోజులో 70 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్

భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ (UPI) సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 2న ఒక్క రోజులోనే యూపీఐ ద్వారా ఏకంగా 70.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2024 ఆగస్టులో రోజుకు 50 కోట్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య, సరిగ్గా ఒక సంవత్సరంలోనే 70 కోట్ల మార్కును దాటడం డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. 2026 నాటికి రోజుకు 100 కోట్ల లావాదేవీలు జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జియోని వెనక్కి నెట్టేసిన ఎయిర్‌టెల్‌..!

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.5,948 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. జియో విషయానికి వస్తే.. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.324.66 కోట్లు. గత సంవత్సరం ఇదే కాలంలో జియో రూ.312.63 కోట్ల లాభం అందుకుంది. జియో లాభం స్వల్పంగా మాత్రమే పెరిగింది. మనం గణాంకాలను పోల్చి చూస్తే, ఈసారి ఎయిర్‌టెల్ లాభంలో జియోను దాదాపు […]

జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ టాప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలంగా పుంజుకుంటోందని.. ఏపీ బలమైన ఆర్థిక పునరుద్ధరణకు జులై నెల జీఎస్టీ వసూళ్లే కారణమంటున్నారు. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. అలాగే ఏపీ వార్షిక వృద్ధి కూడా.. 14 శాతంగా ఉంది. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో ఏ జులైలోనూ లేనంత జీఎస్టీ వసూళ్లను ఏపీ గత నెలలో సాధించింది. అలాగే 2018 నుంచి 2025 వరకూ.. జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రావటం […]

టెస్లా కంపెనీకి ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా

ఎలాన్ మస్క్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది.2019లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లాపై కేసు నమోదైంది. టెస్ల్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థలో లోపం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో సుమారుగా రూ.1996 కోట్లు)పరిహారం చెల్లించాలని టెస్లాను ఆదేశించింది.

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు..

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు ఇచ్చింది. రూ. 17వేల కోట్ల లోన్ ఫ్రాడ్‌ కేసులో సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆగస్టు 5వ తేదీ విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇక ఢిల్లీలో ఇది ప్రధాన కార్యంలో విచారకు హాజరైనప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు.

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అలర్ట్

ఆగస్టు 1 నుండి UPI నియమాలు మారబోతున్నాయి. రోజుకు 50 సార్ల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తనిఖీ చేయలేరు. UPI ఆటో-పే లావాదేవీలు (బిల్లు చెల్లింపులు, EMIలు, సబ్‌స్క్రిప్షన్‌లు వంటివి) ఇకపై నిర్దిష్ట సమయాలలోనే జరుగుతాయి. , ఈ సమయాలు ఉదయం 10 గంటల ముందు, లేదా మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. రాత్రి 9:30 తర్వాత ఒక స్లాట్ నిర్ణయిస్తారు. సాధారణ వినియోగదారులు గతంలో లాగే రోజువారీ బిల్లు చెల్లింపులు, […]

భారత్‌పై అక్కసు.. 25శాతం టారీఫ్‌, పెనాల్టీ విధించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్‌ ప్రకటించారు. తాము వారించినా వినకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారీఫ్‌తో పాటు అదనపు పెనాల్టీ కూడా విధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై కొత్త టారీఫ్‌, పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ వెల్లడించారు.

అనిల్ అంబానీపై ఈడీ దాడులు

అనిల్అంబానీకి బిజినెస్లో గడ్డుకాలాన్ని కొనసాగిస్తున్నారు. అనిల్ అంబానీ కి చెందిన సంస్థలపై ఈడీ దాడులకు దిగింది. ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఈడీసోదాలను కొనసాగిస్తున్నది. ఇందుకు కారణం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణం చెల్లించేస్థితిలో లేనని గతంలోనే ప్రకటించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసులున్నాయి.

సంక్షోభాల్లో అవకాశాలు వెతకాలి.. సీఎం చంద్రబాబు

ఏడారి మధ్యన అద్భుత నగరంగా దుబాయ్ దాన్ని చూస్తే అసూయగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాలనైనా అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. “1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ, మరో సాంకేతిక విప్లవం దశలో ఉన్నాం,” అని 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ తనదైన […]

అడ్డంగా బుక్కైన మింత్రా.. రంగంలోకి దిగిన ఈడీ

మింత్రాపై ఈడీ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. రూ.1,654.35 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించినందుకు మింత్రా తో పాటు దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. హోల్‌సేల్ వ్యాపారం చేసే సంస్థలు నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అందించకూడదు. రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు హోల్‌సేల్‌గా అమ్మాలి. అయితే మింత్రా మాత్రం తన అనుబంధ సంస్థ ద్వారా నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అమ్మింది. ఇది ఫెమా ఉల్లంఘనల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON