loader

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అర్మానీ మరణ వార్తను ఆయన ఫ్యాషన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ఫ్యాషన్ ఐకాన్ చిత్రాన్ని పంచుకుంటూ, సంస్థ ఇలా పేర్కొంది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, నిరంతర ప్రేరణ శక్తి అయిన సిగ్నర్ […]

ఐపీఎల్‌ అభిమానులకు షాక్‌..! టికెట్లపై 40శాతం జీఎస్టీ..!

కొత్త జీఎస్టీ శ్లాబులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి క్రికెట్‌ ఈవెంట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇకపై ఐపీఎల్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్ల టికెట్ల విక్రయాలపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. 40శాతం రేటు ఐపీఎల్‌ వంటి ఈవెంట్లకు మాత్రమే వర్తించనున్నది. రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 18 శాతం చొప్పున జీఎస్టీ కొనసాగుతుంది. అంటే, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా టోర్నమెంట్ల ప్రేక్షకులపై ఎటువంటి అదనపు భారం […]

జీఎస్టీ స్లాబ్‌ మార్పులతో స్టాక్‌ మార్కెట్లో జోష్‌. 15 నిమిషాల్లోనే రూ.4 లక్షల కోట్ల లాభం

GST తగ్గింపు ప్రకటన భారత మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది దీనితో పాటు అనేక విషయాలపై పన్ను రేట్లు తగ్గాయి. ఈ తగ్గింపు పెట్టుబడిదారుల మనోధైర్యాన్ని పెంచింది. అలాగే మార్కెట్ ఊపందుకుంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మంచి జంప్‌ను చూపించాయి. మొత్తం మార్కెట్‌లో కొనుగోలు వాతావరణం సృష్టించింది. గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బిఎస్ఇ సెన్సెక్స్ దాదాపు 647 పాయింట్లు పెరిగి 81,214కి చేరుకుంది. నిఫ్టీ కూడా 194 పాయింట్లు పెరిగి 24,909కి చేరుకుంది.

ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే.. సామాన్యులకు బిగ్ రిలీఫ్

ఇకపై జీఎస్టీలో 2 శ్లాబులు మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరటనిస్తూ నిత్యావసరాలు, ఆహార పదార్థాలు,డ్రై ఫ్రూట్స్, వైద్యం – ఆరోగ్య సంరక్షణ,33 రకాల మందులు రేట్లు తగ్గనున్నాయి. సెల్‌ఫోన్లపై జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి తగ్గించారు, సిమెంట్‌పై పన్ను 28శాతం నుండి 18శాతంకి తగ్గించారు. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. కూల్ డ్రింక్స్, జ్యూస్‌లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. పొగాకు, జర్దా, పాన్ మసాలా, ఫ్లేవర్ ఉన్న ప్యాకేజ్డ్ పానీయాలపై 40శాత పన్ను […]

వరుసగా 56 సెషన్లుగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్..

భారత స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. గత వారం తీవ్ర ఒడుదొడుకులతో భారీ నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరగ్గా 80,220 మార్కు వద్ద కదలాడుతోంది. మరోవైపు నిప్టీ 140 పాయింట్లు పెరిగి 24,560 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, బ్యాంకింగ్ సహా పలు కీలక రంగాలు పుంజుకుంటున్నాయి. సంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్ స్టాక్ సోమవారం సెషన్‌లో కూడా 2 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. […]

TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో ఒక కొత్త, అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించబోతోంది. దీని కోసం బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, TCS 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఈ మొత్తం డీల్ విలువ రూ. 2,130 కోట్లుగా ఉంది. బెంగళూరులోని ఈ కొత్త క్యాంపస్ వేల మంది ఉద్యోగులకు ఉపాధి […]

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్‌

చైనాకు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) మళ్లీ ఇండియాకు రానుందనే చర్చ సాగుతోంది. 2020లో భారత ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో దీనిని నిషేధించింది. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది భారతీయ యూజర్లకు టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతోంది. ఇది టిక్ టాక్ రీఎంట్రీకి సంకేతమా అన్న చర్చ మళ్లీ మొదలైంది. శుక్రవారం నుంచి పలువురు యూజర్లు ఈ వెబ్‌సైట్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి..

ఒకప్పుడు గురుగ్రామ్ అంటే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లా. కానీ, ఇప్పుడు ఆ స్థానం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాది.తలసరి ఆదాయంలో గురుగ్రామ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత సంపన్న జిల్లాల జాబితాలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఆర్థిక సర్వే 2024-2025 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గురుగ్రామ్‌ను అధిగమించి, దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా నిలిచింది. ఈ జిల్లా తలసరి జీడీపీ […]

వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్‌.. అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పరిమితి తగ్గింపు!

పట్టణ ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లకు మినిమమ్‌ బ్యాలెన్స్ నిబంధనలను ICICI బ్యాంక్ పాక్షికంగా రూ.50,000 నుండి రూ.15,000కి తగ్గించింది. వినియోగదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావడంతో ఎట్టకేలకు కొన్ని రోజుల్లోనే వెనక్కి తగ్గింది. ఇప్పటికీ మునుపటి దానికంటే రూ. 5,000 ఎక్కువ. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని కొత్త ఐసిఐసిఐ బ్యాంక్ మినిమమ్‌ బ్యాలెన్స్‌ను కూడా రూ.25,000 నుండి రూ.7,500కి తగ్గించారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో పాత కస్టమర్లకు మినిమమ్‌ బ్యాలెన్స్‌ నియమాన్ని రూ.5,000 వద్దే […]

ఢిల్లీ షోరూమ్ లో టెస్లా ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల లోపే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో తన రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON