సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌లో జనవరి నెలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెలలో కొనుగోళ్ల చెల్లింపుల లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారా జరగడంతో వీటి సంఖ్య, విలువ భారీగా పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్,కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తెలిపింది. జనవరిలో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా రికార్డు స్థాయిలో రూ.28.33 లక్షల కోట్లు లావాదేవీలు నమోదయ్యాయి.

