ఉద్యోగులకు బహుమతిగా కార్లు
చెన్నైలో టెక్ సర్వీసెస్ సంస్థ అజిలిసియం తన 10 ఏళ్ల ప్రస్థానంలో తమతో కలిసి ప్రయాణించిన ఉద్యోగులకు 25 కొత్త హ్యుందాయ్ క్రెటా SUVలను బహుమతిగా ఇచ్చింది. సంస్థలోని ప్రతి స్థాయిలో వ్యక్తిగత పనితీరు ఆధారంగా వేతన పెంపును కూడా ప్రకటించింది. చెన్నై కంపెనీ ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రయత్నం ఆలోచనాత్మక కార్పొరేట్ కృతజ్ఞతకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

