loader

కెప్టెన్ కూల్ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎంఎస్ ధోని..!

మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుకుంటే.. ప్రతిఒక్కరికి మరో పేరు గుర్తొస్తుంది. అదే “కెప్టెన్ కూల్”. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. తాను కూల్‌గా, చాలా బాలెన్స్ గా కెప్టెన్సీ చేసేవాడు. అందుకే కెప్టెన్ కూల్ అని అందరూ పిలుస్తారు. తాజాగా ఈ పేరు కోసం ధోని ట్రేడ్‌మార్క్ దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ఈ దరఖాస్తు ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ పదంపై హక్కులను అధికారికంగా పొందాలనుకుంటున్నట్లు ధోని […]

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్ ఫర్నేస్‌-3 పునఃప్రారంభం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిలో మరో కీలక అడుగు పడింది. స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్ ఫర్నేస్‌-3ని ఎట్టకేలకు పునఃప్రారంభించారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబరులో మూతపడిన బీఎఫ్‌-3ను మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకు ఏడు వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లాస్‌ ఫర్నేస్‌-3పై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు మంచిరోజులొస్తాయని భావిస్తున్నారు.

కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ

కర్నూలు వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1,622 కోట్లతో శీతలపానీయాల పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుతో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఓర్వకల్లు ఏపీఐఐసీ ల్యాండ్ లో పరిశ్రమ ఏర్పాటు చేస్తారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తారు. 2026 డిసెంబర్ లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థకు గడువు విధించారు.

ఆల్ టైమ్ కనిష్టానికి ఓలా షేర్లు..

్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు సోమవారం కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్లాక్‌డీల్ కారణంగా షేర్లు పెద్ద మొత్తంలో చేతులు మారడం, వినియోగదారుల ఫిర్యాదులు, ప్రభుత్వ దర్యాప్తులు, పోటీ పెరగడం, ఆర్థిక నష్టాలు వంటి కారణాల వల్ల షేరు విలువ పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ షేరు విలువ ప్రారంభంలో రూ. 91.20 వద్ద ఉండగా, ప్రస్తుతం రూ. 43.20కి పడిపోయింది.

కావ్య మారన్ తండ్రికి నోటీసులు పంపిన ఆమె బాబాయ్..

సన్ టీవీ గ్రూప్‌కు సంబంధించిన వాటాల విషయంలో కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళానిధి మారన్, అతడి భార్య కావేరి కళానిధి, మరో ఆరుగురికి దయానిధి మారన్ లీగల్ నోటీసు పంపించారు. కళానిధి మారన్ 2003 నుంచి సన్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సన్ గ్రూప్, దాని సంబంధిత కంపెనీలలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని […]

ఇందిరా మహిళా శక్తి పథకం…వనిత టీ స్టాల్

తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రంలో మహిళా సాధికారత ధ్యేయంగా ‘ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక… రచన మహిళా సమైక్య సంఘం ద్వారా రెండు లక్షల రుణం పొంది వనిత టీ స్టాల్‌ని ఏర్పాటు చేసుకోగా… కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ప్రారంభించారు.

వేధించొద్దు కానీ ఆ దారులు అన్నీ మూసేయ్యండి..

రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అదే సమయంలో పన్ను వసూళ్లలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు.

రూ.3 వేలు కడితే చాలు…ఏడాది టోల్ గేటు పాస్

రెగ్యులర్ గా హైవేల పై ప్రయాణించే వారికి, అలాగే ట్రాన్స్ పోర్ట్ వాహనాల కోసం FASTag annual pass అందుబాటులోకి తెచ్చింది. ఏడాది మొత్తం టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్ళవచ్చు. ఈ పాసు ధర 3000 రూపాయలుగా నిర్ణయించారు. లేదా 200 ట్రిప్పులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ వల్ల టోల్ ఫీజు అత్యధికంగా చెల్లిస్తున్న వారికి ఇది ఒక రకంగా […]

ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు..

యూపీఐ చెల్లింపు జూన్ 16న మరింత వేగంగా సాగాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త ఆదేశాలతో వేగవంతమైన చెల్లింపులు సాధ్యమయ్యాయని, గతంలో యూపీఐ చెల్లింపులకు గరిష్ట సమయం 30 సెకన్లుగా ఉంటే ఎన్‌పీసీఐ దాన్ని 15 సెకన్లకు తగ్గించింది. ఈ తగ్గింపు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లతో సహా యోనో ఎస్‌బీఐ, ఐమొబైల్ పే, ఇతర బ్యాంకింగ్ యాప్‌లకు వర్తిస్తుంది.

మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వచ్చేసింది..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద నూతన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పది రోజుల ట్రయల్ రన్ ప్రారంభించింది. కొరియన్ టెక్నాలజీతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ 72 కార్లను నిలిపే సామర్థ్యం కలిగి ఉంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను నిలిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆటోమేటెడ్ వ్యవస్థలు, సెన్సార్లు, లిఫ్టుల సహాయంతో వాహనాలను వేగంగా.. సమర్థవంతంగా పై అంతస్తులలోకి లేదా కింది అంతస్తులలోకి తరలించవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON